‘చంద్రబాబే పెద్ద మోసకారి’
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
సరుబుజ్జిలి: గడిచిన ఎన్నికల్లో ఎలాగైనా పదవి ద క్కించుకోవాలని చంద్రబాబు ఇష్టానుసారం హామీ లు ఇచ్చారని, పదవిలోకి వచ్చాక అన్నీ మర్చిపోయారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. మండలంలోని సరుబుజ్జిలి గ్రామంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటిసంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఽకృష్ణదాస్ మాట్లాడుతూ రాజధాని పేరుతో భూము లను కార్పొరేట్ శక్తులకు ధారబోసి కోట్లాది రూపాయలు దోపిడీ చేసేందుకు చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వం పరిపాలన పక్కన పెట్టి దాచుకోవడం, దోచుకోవడానికే ఎక్కువ సమ యం కేటాయిస్తోందని విమర్శించారు. పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చేస్తున్న దగాకోరు పాలనకు ప్రజలు చరమగీతం పాడాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధిని పక్కనపెట్టి థర్మల్ పేరుతో బూడిద, శాండ్, ల్యాండ్, లిక్కర్ వ్యాపారాల కోసం అధిక సమయం కేటాయిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి సురవరపు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గం పరిశీలకులు కరిమి రాజేశ్వరరావు, రాష్ట్ర రైతు విభాగం నేత కె.శేఖర్, సరుబుజ్జిలి, బూర్జ మండలాల పార్టీ కన్వీనర్లు బెవర మల్లేశ్వరరావు, ఖండాపు గోవిందరావు, సరుబుజ్జిలి సర్పంచ్ బొడ్డేపల్లి చాందిని వెంకటసూర్య, పార్టీ ఉపాధ్యక్షుడు కింజరాపు సురేష్, పున్నపురెడ్డి తవిటినాయుడు, బొడ్డేపల్లి హరి, అత్తులూరి రవికాంత్, కొవిలాపు చంద్రశేఖర్, రావాడ రవికుమార్, ఇల్లాకుల సూర్యప్రకాశరావు, యడ్ల ఈశ్వరరావు, పుచ్చరాజారావు పాల్గొన్నారు.


