
● సచివాలయంలో ఎరువుల బస్తాలు చోరీ
పాతపట్నం: తెంబూరు గ్రామ సచివాలయంలో శుక్రవారం అర్ధరాత్రి రెండు బస్తాల యూరియాను దొంగతనంగా తీసుకువెళుతుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం తెంబూ రు గ్రామ సచివాలయానికి 220 బస్తాలు రావడంతో సచివాలయంలో యూరియా బస్తాలను సచివాలయం వీఏఏ దింపించారు. శుక్రవారం అర్ధరాత్రి సచివాలయం ఉద్యోగులు తాళాలు తీసి రెండు యూరియా బస్తాలను ఓ వ్యక్తికి ఇచ్చారు. ఆ వ్యక్తి బైక్‌పై యూరియా తీసుకెళ్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. దీంతో అతడు రెండు యూరియా బస్తాలు అక్కడే వదిలేసి వెళ్లిపాయాడు. ఇలా అర్ధరా త్రి బయట వ్యక్తులు బస్తాలు తీసుకెళ్లడమేంటని రై తులు ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ఏఓ కిరణ్‌వా ణి వద్ద ప్రస్తావించగా తమ దృష్టికి రాలేదన్నారు.