మార్కెట్‌ కమిటీ చైర్మన్ల నియామకం | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ కమిటీ చైర్మన్ల నియామకం

Jul 18 2025 5:02 AM | Updated on Jul 18 2025 5:02 AM

మార్క

మార్కెట్‌ కమిటీ చైర్మన్ల నియామకం

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో నాలుగు మార్కెట్‌ కమిటీల చైర్మన్ల నియమించినట్లు తెలిపారు. పాతపట్నం నియోజకవర్గంలో హిరమండలం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా మామిడి రామకృష్ణ (జనసేన), పాతపట్నం చైర్‌పర్సన్‌గా గౌరమ్మ చిన్నింటి, ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కంచిలి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా మద్దిలి విజయలక్ష్మి (టీడీపీ), శ్రీకాకుళం నియోజకవర్గంలోని శ్రీకాకుళం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా దారపు జ్యో

త్స్న(జనసేన) ను నియమించినట్లు తెలిపారు.

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

పొందూరు: స్థానిక కచేరీ వీధికి చెందిన చిరు వ్యాపారి ఎరబోతు దుర్గారావు(28) బుధవారం రాత్రి తన ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు వేసుకుని ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. రాత్రి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి తెరిచిచూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే స్థానిక సామాజిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. గురువారం పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

గంజాయితో ఇద్దరు అరెస్టు

ఇచ్ఛాపురం టౌన్‌: ఒడిశా నుంచి ముంబాయికి 22.566 కిలోల గంజాయి తరలిస్తున్న ఒడిశా రాష్ట్రం మోహన బ్లాక్‌కు చెందిన తులుషా నాయిక్‌, సామ్సన్‌ బీరోలను అరెస్టు చేసినట్లు సోంపేట ఎకై ్సజ్‌ మొబైల్‌ సీఐ జీవీ రమణ తెలిపారు. జిల్లా ఎకై ్సజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ ఆదేశాల మేరకు అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ మురళీధర్‌ ఆధ్వర్యంలో సోంపేట మొబైల్‌ ఎకై ్సజ్‌ బృందం ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌ చుట్టుపక్కల గురువారం తనిఖీలు చేపట్టింది. ఆ సమయంలో అనుమానాస్పదంగా తులుషా నాయిక్‌, సామ్సన్‌ బీరోలు తిరుగుతుండగా గమనించి వారి లగేజీ తనిఖీ చేశారు. దీంతో వారి వద్ద 22.566 కిలోల గంజాయి పట్టుబడడంతో అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలోని జితున్‌ అనే వ్యక్తి వీరి ద్వారా ట్రైన్‌లో ముంబాయికి గంజాయి తరలించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.లక్ష వరకు ఉంటుందన్నారు. తనిఖీల్లో ఎకై ్సజ్‌ ఎస్‌ఐ ఐ.సుజాత, సిబ్బంది శ్రీనివాస్‌, విజయ్‌, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

రేషన్‌ తూకంలో తేడా వస్తే చర్యలు

జి.సిగడాం: ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న రేషన్‌ బియ్యం తూకంలో తేడా వస్తే ఉపేక్షించేది లేదని శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్‌ అధికారి కె.సాయి ప్రత్యూష హెచ్చరించారు. మండల కేంద్రంలోని పౌర సరఫరాల గిడ్డంగిని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేషన్‌ డిపో డీలర్లకు బియ్యం తరుగుదల లేకుండా పంపిణీ చేయాలని, ఎక్కడైనా బియ్యం తరుగుదల వస్తే వెంటనే సంబంధిత గోదాం అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రేషన్‌ సరుకులు లబ్ధిదారులకు సకాలంలో అందేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎఫ్‌సీ గోదాం నుంచి వస్తున్న బియ్యాన్ని తూకం వేసి తీసుకోవాలన్నారు. అనంతరం మెట్టవలస గ్రామంలో మందుగుండు సామాగ్రి విక్రయించేందుకు షాపు నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుడి స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే అనుమతులు ఇస్తామన్నారు. ఆమెతో పాటు తహసీల్దార్‌ మహాదేవు సరిత, ఆర్‌ఐ అబోతుల రాధ, వీఆర్వో లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.

పక్కాగా ప్రీస్కూల్‌ నిర్వహణ

సారవకోట: అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్‌ నిర్వాహణ పక్కాగా జరగాలని సారవకోట ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారి ఎస్‌.అనూరాధ సిబ్బందికి సూచించారు. గురువారం సారవకోట మండల పరిషత్‌ సమావేశ మందిరంలో సారవకోట, జలుమూరు మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పీపీ–1, పీపీ–2 పాఠ్య పుస్తకాలలో ఉన్న సబ్జెక్టు మేరకు ప్రతిరోజు అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్‌ నిర్వహణ చేపట్టాలన్నారు. కేంద్రాల నిర్వహణ, లబ్ధిదారులకు అందాల్సిన పౌష్టికాహారం తదితర వివరాలను యాప్‌లలో నమోదు చేయాలన్నారు. సమావేశంలో సూపర్‌వైజర్లు సుజాత, సీతారత్నం, పద్మావతి, మనోహరి పాల్గొన్నారు.

మార్కెట్‌ కమిటీ చైర్మన్ల నియామకం 1
1/1

మార్కెట్‌ కమిటీ చైర్మన్ల నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement