
ఇదేం పద్ధతి..?
టెక్కలి: టెక్కలి మేజర్ పంచాయతీలో వివిధ రకాల పనుల కోసం అధికారులు తయారు చేసిన నిధుల అంచనాలను వార్డు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పంచాయతీ నిధులను దోచుకోవడానికే అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు చెప్పినట్లుగా అధికారులు అమాంతంగా నిధుల అంచనాలను పెంచేశారంటూ మండిపడుతున్నారు. దీనిలో భాగంగా ఇటీవల పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో పంచాయతీ అధికారులు వార్డు సభ్యులకు అందజేసిన అజెండాలో పొందుపరచిన అంశాలను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా తమ పరిధిలో తమకు తెలియకుండా అధికారులు ఒంటెద్దు పోకడతో ఇష్టానుసారంగా తయారు చేసిన అంచనాలను వ్యతిరేకిస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. ప్రధానంగా టెక్కలి జగతిమెట్ట నుంచి జాతీయ రహదారి బైపాస్ వరకు ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ మరమ్మతుల కోసం ఏకంగా రూ.35 లక్షలతో ప్రతిపాదనలు చేయడంపై కంగుతిన్నారు. వీటితో పాటు మరికొన్ని పనుల అంచనాలను తప్పుబడుతున్నారు.
టెక్కలిలో పనుల అంచనాలు పెంచేసిన అధికారులు
వ్యతిరేకిస్తున్న వార్డు సభ్యులు
నిధులు దోచుకోవడానికేనని ఆరోపణ