
రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు
టెక్కలి రూరల్:
సంతబొమ్మాళి మండలంలోని పాలేశ్వరమ్మ అలయం సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. బోరుభద్ర పంచాయతీ పరిధి ఉదయ్‌పురం గ్రామానికి చెందిన భార్యాభర్తలు వంకల సంజీవ్, వంకల సరస్వతిలు తమ గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై టెక్కలి మండలంలోని రావివలస గ్రామం వైపు వస్తుండగా పాలేశ్వరమ్మ గుడి సమీపంలో బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బైక్‌పై ఉన్నటువంటి ఇరువురికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడినవారిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే సంజీవ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై సంతబొమ్మాళి పోలీసులకు సమాచారం అందించారు. అయితే వీరు వస్తున్న ద్విచక్ర వాహనానికి వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వలన ప్రమాదం జరిగి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు