
●దోచుకోవడానికే...
టెక్కలి మేజర్ పంచాయతీలో అభివృద్ధి పనుల పేరుతో అధికార పార్టీ కార్యకర్తలు చెప్పినట్లుగా అధికారులు అంచనాలు రూపొందించారు. భారీగా అంచనాలు పెంచేసి నిధులను దోచుకోవడానికి ప్లాన్ వేశారు. ముఖ్యంగా సెంట్రల్ లైటింగ్ విషయంలో రూ.35 లక్షల మేరకు అంచనాలు చూస్తుంటే, పంచాయతీలో నిధులు గోల్‌మాల్ చేయడానికి కుట్ర జరుగుతోందని తెలుస్తోంది. అధికారులు తయారు చేసిన అంచనాలతో పాటు గతంలో వార్డు సభ్యుల కు తెలియకుండా చేసిన పనులపై విచారణ చేపట్టాలి. – దాడి ధర్మారావు, వార్డు సభ్యుడు,
టెక్కలి మేజర్ పంచాయతీ
●దోపిడీని అడ్డుకుంటాం
టెక్కలి మేజర్ పంచాయతీలో అభివృద్ధి పనుల పేరుతో చేస్తున్న నిధుల దోపిడీని అడ్డుకుంటాం. ఇప్పటికే పలు సమావేశాల్లో వార్డు సభ్యులంతా వ్యతిరేకిస్తున్నాం. వార్డు సభ్యుల పరిధిలో కనీసం సంప్రదించకుండా అడ్డగోలుగా చేసిన పనులకు మేమెందుకు ఆమోదం ఇవ్వాలి. కొత్తగా తయారు చేసిన అంచనాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ప్రజల అవసరాలకు ఖర్చు చేయాల్సిన నిధులను దోపిడీ చేస్తామంటే ఊరుకునేది లేదు. దీనికి అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
– పీత రమణబాబు, వార్డు సభ్యుడు,
టెక్కలి మేజర్ పంచాయతీ

●దోచుకోవడానికే...