
ఆన్‌లైన్ గేమ్స్‌లో నష్టపోయి.. ఆన్‌లైన్ గేమ్స్ మరో ప్
‘పీఎం సూర్యఘర్ సద్వినియోగం చేసుకోండి’
ప్రధానమంత్రి సూర్యఘర్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోందని, ఇంకా జిల్లాలో లక్ష్యాలను పూర్తి చేయాలని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ డి.చంద్రం ఆదేశించారు. ఆయన బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా సూర్యఘర్‌పై సోలార్ ప్యానల్ కాంట్రాక్టర్లు, వెండర్లు, బ్యాంకు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పలు సూచనలను చేశారు. సోలార్‌తో విద్యుత్‌ను ఆదా చేసుకోవచ్చు నని గృహ వినియోగదారులతో పాటు వాణిజ్య వినియోగదారులు కూడా సూర్యఘర్ పథకాన్ని నాణ్యమైన విద్యుత్‌తో పాటు బ్యాంకు సబ్సిడీలతో సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్కిల్ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావు, టెక్నికల్ ఈఈ సురేష్‌కుమార్ పాల్గొన్నారు. – అరసవల్లి