
4
గంటలు..
నరకం
ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం రైల్వే ట్రాక్ మరమ్మతుల నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఎం.తోటూరు వద్ద రైల్వే గేటును మూసివేశారు. దీంతో వాహనచోదకులు తీవర ఇబ్బందులకు గురయ్యారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిలో నాలుగు గంటల పాటు గేటు వేయడంతో అటువైపుగా వెళ్లే స్కూల్, కాలేజీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో నరకయాతన పడ్డారు. అండర్ పాసేజ్ మొత్తం వర్షం నీటితో మునిగిపోవడంతో సుమారు ఐదు కిలో మీటర్లు దూరంలో ఉన్న బెన్నుగానిపేట, కేదారిపురం గ్రామాలు మీదుగా వాహనాలు రాకపోకలు సాగించాయి. సైకిల్‌పై వెళ్లే వారు, బాటసారులు తప్పని పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి అండర్ పాసేజ్ పక్కనున్న సందులు గుండా రైల్వే పట్టాలపై నుంచి రాకపోకలు సాగించారు. అయితే ముందస్తుగా నాలుగు గంటల పాటు గేట్‌ను మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఉదయం నుంచి ఎల్‌సీ గేటు వద్ద ప్లకార్డులు ప్రదర్శించడంతో వాహనచోదకులు మిన్నకుండిపోయారు.
ఎం.తోటూరు ఎల్‌సీ గేట్‌ను
మూసివేసిన రైల్వే అధికారులు
ఇబ్బందులు పడిన విద్యార్థులు,
వాహనచోదకులు

4

4