
వైఎస్ జగన్‌ను కలిసిన జెడ్పీ చైర్‌పర్సన్
కంచిలి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త, జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌పై ఇటీవల దాడి జరిగిన నేపథ్యంలో ఆమెను పరామర్శించి, అనంతరం జగన్‌ను కలిశారు.
కిడ్నీ బాధితుడికి సాయం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): నరసన్నపేటలో శిష్టకరణ కులానికి చెందిన రఘుపాత్రుని శేఖర్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న శిష్టకరణ సేవా సంఘం ప్రతినిధులు బుధవారం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో శేఖర్ భార్య సుజాతకు రూ.82 వేలు సాయం అందించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు డబ్బీరు శ్రీనివాసరావు, నాయకులు ఎస్‌వీడీ మురళి, ఆర్‌వీఎన్ శర్మ, సదాశివుని కృష్ణ, బలివాడ శివప్రసాద్, నందిగాం కై లేశ్వరరావు, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్ జగన్‌ను కలిసిన జెడ్పీ చైర్‌పర్సన్