
17న చలో విజయవాడ
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జూలై 17న విజయవాడలో జరిగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశాన్ని విజయవంతం చేయాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని యాదవ సంక్షేమ సంఘం కార్యాలయంలో బుధవారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ బీసీలంతా ఐక్యంగా ఉంటేనే హక్కులు సాధించగలమన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు అమీరుల్లా బేగ్, గద్దిబోయిన కృష్ణయాదవ్, త్రినాథ రెడ్డి, కిల్లాన శ్రీనివాస్, తుళ్లూరు, లక్షణరావు, పంచిరెడ్డి కృష్ణారావు, మెహర్, మురపాల రామారావు, గాంధీ, రౌతు మోహన్‌రావు, రంగాజీ దేవ్, కలగ గోపాల్ యాదవ్, గుత్తి చిన్నరావు, కళా వెంకటరావు, కాయితీ వెంకటరమణ, కలగ లక్ష్మణరావు, వంజరాపు రాజులు, అ.రాజేష్, తంగి యర్రమ్మ, దుర్గప్రసాద్, శిమ్మ సూర్యం పాల్గొన్నారు.