
కార్గో ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా నిరసన
మందస: కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాట కమిటీ కన్వీనర్ కొమర వాసు ఆధ్వర్యంలో సోమవారం రాంపురం సచివాలయం ఎదుట నిరసన తెలియజేశారు. రాంపురం, మీల గంగువాడ, తెలగ గంగువాడ బాధిత రైతులు మాట్లాడుతు తరాతరాలుగా తాము ఈ భూములపై పంటలు పండించి వాటిపై జీవిస్తున్నామని, ఇక్కడ అవసరం లేని ఎయిర్ పోర్టు వంటి నిర్మాణాలు చేపడితే దానికి వ్యతిరేకంగా ఎంత దూరమైనా వెళ్తామన్నారు. తమ ఉద్యమానికి స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష, కేంద్ర పౌర విమాన శాఖమంత్రి రామ్మోహన్‌నాయుడు సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చిత్త గున్నయ్య, పొట్టి ఎర్రయ్య, మర్ల జనార్ధన్, దున్న రామారావు, సురేష్, నూకలమ్మ గున్నమ్మ బాధిత రైతులు, మహిళలు యువకులు పాల్గొన్నారు.