
ఓ పోలీసు కానిస్టేబుల్‌తో కుంగ్ ఫు శేఖర్ జరిపిన ఫోన్
పోలీసు: ఎఫ్‌ఐఆర్ ఇండెక్స్ అని ఒకటి ఉంటాది. అది ఎవరికీ ఇవ్వకుండా ఎస్‌ఐ గారు దాచేస్తారట.
కుంగ్ ఫు శేఖర్ : హ హ..
పోలీసు: ఇంకో దాంట్లో ఫెయిర్ చేయాలి. అది చెయ్యొ ద్దని చెప్పారట
కుంగ్ ఫు శేఖర్ : అంటే..
పోలీసు : యాక్చువల్‌గా రెండు రికార్డులు మెయింటైన్ చేయాలి. కానీ ఎస్‌ఐ గారు అందులో ఫెయిర్ చేయొద్దు అని చెప్పారు. నేను చెప్పినప్పుడు చేయండి అని చెప్పారట.
కుంగ్ ఫు శేఖర్ : ఎవరు..? ఎస్‌ఐ గారా..?
పోలీసు : మొత్తానికి సార్ వద్దని అన్నారట.
కుంగ్ ఫు శేఖర్ : అంటే కేసు పెట్టట్లేదా అన్న.. వద్దని అన్నారా..
పోలీసు : పెట్టకపోవడం కాదు. అది పెట్టిందే కాన్ఫిడెన్షియల్‌గా ఉంచండి. నేను చెప్పినప్పుడు చేద్దురు అని చెప్పారట.
కుంగ్ ఫు శేఖర్ : వినండి .. వినండి.. నేను ఎంక్వయిరీ చేశాను. క్లాస్ 5 నాన్‌బెయిల్‌బుల్, నేనేటి చేశానంటే ఎమ్మెల్యేగారికి ఫోన్ చేశాను. ఎమ్మెల్యేగారు వెంటనే ఫోన్ చేశారు డైరెక్టుగా ఎస్‌ఐ గారికి. నేను లైవ్‌లో ఉండగానే చేశారు. అదేటీ లేదండి. నేను స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తాను, కానీ జా గ్రత్తగా ఉండమనండి అని అన్నాడట. చల్ల వాసుకి అలాగే చెప్పారు. ఎమ్మెల్యే గారు, నేను పక్కనున్నప్పుడే మాట్లాడారు. ఏటంటావ్.. నమ్మొచ్చు అంటావా?
పోలీసు : నేను ఒక్కసారి అడుగుతాను. దానికి 41 పోజిబులిటీ ఉందా లేదా అన్నది ..
కుంగ్ ఫు శేఖర్ : దానికై తే 41పాజిబిలిటీ లేదు. కానీ ఎస్‌ఐ అయితే ఇస్తానంటున్నాడు.
పోలీసు : ఎస్‌హెచ్‌ఓకై తే పవర్స్ ఉంటాయబ్బా. నేను నీకు ఎప్పుడో చెప్పాను.
కుంగ్ ఫు శేఖర్ : అదే నాకు డౌట్ వచ్చి మీకు అడిగాను. ఎందుకంటే అతను మన దగ్గర అబద్ధం ఆడవచ్చు. కానీ ఎమ్మెల్యే దగ్గర, చల్ల వాసు దగ్గర అబద్ధం ఆడరు కదా.. నేను 41 ఇచ్చేస్తానులే. ఎస్పీ గారు అయితే ఇది పెట్టారు కానీ అబ్బాయి ఏం చేయలేదు కదా నేను చూసుకుంటానులే అన్నాడట ఎస్‌ఐ.
పోలీసు : అయితే ఒకటి చేయొచ్చు,. ఇందులో ఇద్దరు, ముగ్గురు ముద్దాయిలు అనుకో.. నువ్వు మూడోవాడు అనుకో.. నీకు 41 ఇచ్చే యొచ్చు. నాకు తెలిసి ఇన్వెస్టిగేషన్‌లో తీసేస్తాడేమో నీ పేరు. నేను అదే అనుకుంటున్నాను.
కుంగ్ ఫు శేఖర్ : అదే మాట సేమ్ నువ్వు అన్నట్లే చెప్పాడు అన్న లోక్ అదాలత్‌లోనూ, ఎందులోనో తీసేస్తారు అని..
పోలీసు : ఇన్వెస్టిగేషన్ లో ఎలాగంటే.. శేఖర్ అనే వ్యక్తి ఉండటం వాస్త వమే. కానీ ఆయన ఉన్నప్పుడు జరిగిన సిచ్చువేషన్ ఇది. వెళ్లిపోయిన తర్వాత జరి గింది ఇది.. అని పెడతారు. దానివల్ల ఏటవుతుందంటే మిగతావారికి ఆ సెక్షన్లు వర్తిస్తాయి. నీకు వర్తించవు. అలాగా నీకు ఇన్వెస్టిగేషన్‌లో తీయడానికి అవుతది.
కుంగ్ ఫు శేఖర్ : అయితే ఇప్పుడు నాకు స్టేషన్ బెయిల్ ఇచ్చీవచ్చా అన్నా.. 41 పాజిబుల్ అవుతాదా.. పోలీసు : నీకు ఒకటి చెప్తాను విను. నీకు ఎప్పుడు రమ్మంటే స్టేషన్‌కి అప్పుడు ఫోన్ చేయిపించుకుని వెళ్లిపో. కుంగ్ ఫు శేఖర్ : ఈరోజు సాయంత్రం రమ్మని చెప్పారట వాసుతోని. వాసు వైజాగ్‌లో ఉన్నాడు. నేనేటి చెప్పానంటే వాసుకి.. నువ్వు వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం స్టేషన్‌కి అని చె ప్పాను. ఎమ్మెల్యేది, వాసుది ఒక్కసారి విను. విన్న తర్వాత మీకు క్లారిటీ వస్తది.
పోలీసు : ఏది ఏమైనా నువ్వు స్టేషన్‌కి వెళ్లేటప్పుడు ఒకసారి ఎస్‌ఐకి ఫోన్ చేయించు ఎమ్మెల్యేతోనే.
కుంగ్ ఫు శేఖర్: ఎందుకన్నా చల్లా వాసునే పట్టుకు ని వెళ్తాను స్టేషన్‌కి.. పోలీసు : వాసా.. ఎవరు??
కుంగ్ ఫు శేఖర్: వాసు.. అన్నయ్య, మినిస్టర్ గారి బావమరిది. వాళ్ల సిస్టర్‌నే అచ్చెన్నాయుడు గారు పెళ్లి చేసుకున్నారు. ఎమ్మెల్యే రైట్‌హ్యాండ్ చల్లా వాసే కదా అన్న. అతనే ఉంటాడు అన్నిటిలోని. ఈ ట్రాన్స్‌ఫర్లు, పోస్టింగ్‌లు అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు. అందుకే ఆయన్నే పట్టుకెళ్లి పోతు న్న. వస్తాడు మనకు బాగా పరిచయమే కదా. చల్ల వాసు చాలా పెద్ద స్థాయి వ్యక్తన్నా.. మొన్న నేను స్టేషన్‌కి వెళ్లినప్పుడు కూడా ఎస్‌ఐ గారు నాకు ఏం చెప్పారంటే.. నేను హెల్ప్ చేసిన విషయం వాసు అన్నయ్యకు చెప్పు, వాసు అన్నయ్య నాకు బాగా క్లోజ్, కొంచెం నువ్వు చెప్పు నీకు నేను ఎలా చూశానో అనేది అని ఆయన అన్నాడు. అన్నయ్య ఈ రోజు సాయంత్రం వాసుని స్టేషన్‌కి తీసుకుని బెయిల్ తీసుకుంటాను అన్నయ్య.. ఉంటాను.