
స్కూల్ ఆటో బోల్తా
నరసన్నపేట: దేశవానిపేట సమీపంలో పోలాకికి వెళ్లే దారిలో ఆర్‌అండ్‌బీ రహదారిపై స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో టైర్‌పంక్చర్ కావడంతో అదుపు తప్పి పొలాల్లో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈదులవలస మోడల్ స్కూల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో శ్యామ్‌చరణ్(ఇందిరానగర్), కె.కామేశ్వరి(పిరువాడ), జి.గుణశ్రీ (రాళ్ల గోదాయవలస), సీహెచ్ కుసుమ కావ్య(పిరువాడ), వి.జాగృతి(జమ్ము), వై.గీతా శ్రీ (పిరువాడ) గాయపడగా.. నలుగురు విద్యార్థులు సురక్షితంగా బయట పడ్డారు. శ్యామ్‌చరణ్‌కు తీవ్ర గాయాలు కావడంతో నరసన్నపేట ఆసుపత్రిలో చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పైడి ప్రవీణ విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ తెలిపారు.
ఆరుగురు విద్యార్థులకు గాయాలు
ఈదులవలస మోడల్ స్కూల్‌కు వెళ్తుండగా ఘటన

స్కూల్ ఆటో బోల్తా