శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Jul 4 2025 7:03 AM | Updated on Jul 4 2025 7:03 AM

శ్రీక

శ్రీకాకుళం

7

ప్రజలకు

కూటమి ఇచ్చిన

బాండును చూపిస్తున్న

బొత్స సత్యనారాయణ

కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలనే ఉద్దేశంతో ‘రీకాల్‌ చంద్రబాబు మేని ఫెస్టో’ కార్యక్రమం రూపొందించలేదు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేసి.. ప్రజల పక్షాన నిలబడేందుకే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. – శాసన మండలి ప్రతిపక్ష నేత

బొత్స సత్యనారాయణ

ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే మెడలు

వంచి ప్రశ్నిస్తాం.

మీ బెదిరింపులకు భయపడేదే లేదు.

శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025

శ్రీకాకుళం నగరంలో జరిగిన వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో క్యూఆర్‌కోడ్‌ పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

హామీలు అమలుచేయని మోసగాళ్లు చంద్రబాబు, పవన్‌: శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ

ఏపీలో చంద్రన్న దగ...పగ అనే పథకాలు అమలవుతున్నాయ్‌: కురసాల కన్నబాబు

బాబు ఏడాది పాలనలో కోట్లాది

రూపాయిల బకాయి: కుంభా రవిబాబు

వైఎస్సార్‌ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ధ్వజమెత్తిన నేతలు

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ):

ధికార దాహంతో దారిన కనబడిన వారందరితో చేతులు కలిపి, అధికారం చేతికి వచ్చాక ఇచ్చిన మాట మర్చిపోయిన మోసగాళ్లు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ అని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి ప్రజల పక్షాన నిలబడేందుకు ‘రీకాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమం రూపొందించామని ఆయన తెలిపారు. అధికార పక్ష బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు బెదిరిపోరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. తాము ఈవీఎంల ద్వారా ఓడిపోయామో, ఏ విధంగా ఓడిపోయామో ఆ దేవుడికే తెలుసని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు హొటల్‌లో గురువారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ పేరిట కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు.. రీకాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో పేరిట ఇంటింటి ప్రచార కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. జిల్లా వ్యాప్తంగా 5 వారాల పాటు జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి, అనంతరం ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వాల మోసాల్ని వివరించేందుకు కార్యాచరణ రూపొందించి నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం బొత్స మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ పరామర్శలకు వెళ్తున్నా బురద జల్లుతున్నారని విమర్శించారు. జిల్లాలోని మూలపేట పోర్టును చంద్రబాబే ప్రారంభించారని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పడం సిగ్గు చేటన్నారు.

సమావేశంలో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌, తూర్పుకాపు, కాళింగ, కళింగవైశ్య కులాల రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్‌, దుంపల లక్ష్మణరావు, అంధవరపు సూరిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకటగోపాల సత్యనారాయణ, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ పాలిన శ్రావణి మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంవీ స్వరూప్‌, జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీ, మున్సిపల్‌ మాజీ చైర్‌ పర్సన్‌ ఎంవీ పద్మావతి, గ్రీవెన్స్‌సెల్‌ అధ్యక్షుడు రౌతు శంకరరావు, ఎస్సీసెల్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణ, మహిళా విభాగం అధ్యక్షురాలు ఉలాల దివ్యభారతి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, ముత్తా విజయ్‌కుమార్‌, పిలక రాజ్యలక్ష్మి, కరిమి రాజేశ్వరరావు, గొండు కృష్ణమూర్తి, మూకళ్ల సుగుణ, పిన్నింటి సాయి, ఎన్ని ధనుంజయరావు, చిట్టి జనార్ధనరావు, సనపల నారాయణరావు, తంగుడు నాగేశ్వరరావు, బల్లాడ హేమమాలిని, జనార్ధనరావు, సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, బొడ్డేపల్లి పద్మజ, సాధు వైకుంఠరావు, గుంట జ్యోతి, గద్దిబోయిన కృష్ణయాదవ్‌, కోట గోవిందరావు, ప్రేమ్‌కుమార్‌ పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

మద్యం ఏరులై పారుతోంది..

రాష్ట్రంలో మంచినీళ్లు దొర క్కపోయినా గ్రామగ్రామాన మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో 119 మంది ఐపీఎస్‌లకి పోస్టింగులు లేవు. కొందరిని సస్పెండ్‌ చేయడం మరీ దారుణం. నిన్న కాక మొన్న ఒక ఐపీఎస్‌ అధికారి రాజీనామా చేసి ఢిల్లీ వెళ్లిపోయారు. వైఎస్సార్‌సీపీ నాయకులు చాలా మందిని అరెస్టు చేసి వారికి బెయిల్‌ ఇవ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. చంద్రబాబు సంపద సృష్టించడానికే అప్పులు చేస్తున్నామని చెప్పడం విడ్డూరం. – తమ్మినేని సీతారాం, పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త

శ్రీకాకుళం1
1/3

శ్రీకాకుళం

శ్రీకాకుళం2
2/3

శ్రీకాకుళం

శ్రీకాకుళం3
3/3

శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement