జీడి రైతు గగ్గోలు | - | Sakshi
Sakshi News home page

జీడి రైతు గగ్గోలు

Jul 4 2025 7:03 AM | Updated on Jul 4 2025 7:03 AM

జీడి

జీడి రైతు గగ్గోలు

కారుచౌకగా జీడి పిక్కల కొనుగోలు

పలాస:

ద్దానం ప్రాంత ప్రజల జీవనాధారమైన జీడి పిక్కలను పలాస జీడి వ్యాపారులు కారుచౌకగా కొనుగోలు చేస్తున్నారు. 80 కిలోల జీడి పిక్కల బస్తా ధర ప్రస్తుతం తప్పని పరిస్థితుల్లో రైతులు రూ.12,500లకు అమ్ముకుంటున్నారు. ఇటీవలే ఉద్దానం ప్రాంతంలోని మామిడిపల్లి, బొడ్డపాడు, మాకన్నపల్లి తదితర గ్రామాల్లో పలాస జీడి వ్యాపారులు జీడి పిక్కలను కొనుగోలు చేశారు. అయితే నేరుగా జీడి వ్యాపారులు మాత్రం ఈ పిక్కలను కొనుగోలు చేయడం లేదు. గ్రామాల్లో ఉన్న చోటా నాయకులు దళారులుగా ఏర్పడి ఆయా గ్రామాల్లో జీడి వ్యాపారులు తరఫున పిక్కలను కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది ఇదే నెలలో రైతులు బస్తా జీడి పిక్కలను ఆయా గ్రామాల్లో రూ.13,500లకు విక్రయించారు.

ఈ ఏడాది ఇంకా జీడి పిక్కలధరలు పెరుగుతాయని ఆశించారు. అయితే దీన్ని పసి గట్టిన జీడి వ్యాపారులు తమ జీడి పప్పునకు డిమాండ్‌ లేదని, జీడి పప్పు నిల్వలు ఉండి పోయాయని తదితర కారణాలతో పలాసలో జీడి పరిశ్రమలను జూన్‌ 1 నుంచి నిరవధికంగా బంద్‌ చేశారు. దీంతో జీడి కార్మికులు రోడ్డున పడ్డారు. రైతులు తమ జీడి తోటల్లో సేకరించిన జీడి పిక్కలను ఇళ్లలో భద్రపరిచారు. పిక్కలను అమ్ముకోవడానికి నానా ప్రయత్నాలు చేశారు. జీడి రైతాంగ కమిటీ నాయకులు ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. జీడి కార్మికులు కూడా తమకు పనికల్పించాలని నిరాహార దీక్షలు చేశారు. అయినా పరిశ్రమదారులు మాత్రం దేన్ని పట్టించుకోలేదు. ఇటీవల కొద్ది రోజుల కిందట జీడి పరిశ్రమలు తెరిచారు. దీంతో గ్రామాల్లోకి ఎప్పటి లాగే జీడి వ్యాపారులు జీడి పిక్కలను కొనుగోలు చేయడానికి వస్తున్నారు. అయితే వారు నేరుగా జీడి రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదు. గ్రామాల్లో ఉన్న దళారులను పట్టుకొని వారి చేత పిక్కలను కొనుగోలు చేయిస్తున్నారు. ఈ దళారుల్లో అధికారపార్టీ నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. అన్ని వర్గాల వారు దీనిపై ప్రేక్షక పాత్ర వహించడం విశేషం. మొత్తానికి జీడి పరిశ్రమల బంద్‌ పేరుతో వ్యాపారులు చేసి కార్యక్రమాలు వారికి అనుకూల ఫలితాలు చేకూర్చుతున్నాయి. మేనెలలో జీడి పిక్కలను అమ్ముకోవలసిన రైతులకు ఇప్పుడు ఈ పరిస్థితులు మింగుడు పడటం లేదు. జీడి పిక్కలు బాగా ఎండిపోవడం వల్ల తరుగు ఏర్పడింది. కనీసం బస్తా పిక్కల దగ్గర కనీసం 5కిలోల తరుగు వచ్చింది. అంతే కాకుండా ధర కూడా బాగా తగ్గిపోయింది.

మే నెలలో బస్తా పిక్కల ధర రూ.13500లు ఉండగా ప్రస్తుతం తప్పని పరిస్థితిలో తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పాలక పార్టీ నాయకులు పట్టించుకోక పోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బస్తా పిక్కల ధర రూ.12,500

గత ఏడాది ఇదే నెలలో రూ.13,500

జీడి రైతు గగ్గోలు1
1/2

జీడి రైతు గగ్గోలు

జీడి రైతు గగ్గోలు2
2/2

జీడి రైతు గగ్గోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement