
హామీల అమలులో సర్కారు తీరిదీ..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయింది. ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయకపోగా అప్పటివరకు ప్రజలకు అందుతున్న సేవలు, పథకాలను అటకెక్కించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మాత్రమే కాకుండా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్, గౌతు శిరీష, మామిడి గోవిందరావు, కూన రవికుమార్, గొండు శంకర్, నడుకుదిటి ఈశ్వరరావు తదితరులు సూపర్ సిక్స్‌తో పాటు వ్యక్తిగత హామీలిచ్చారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటీ అమలు చేయలేదు. ఎన్నికలు అయిపోయాక అబ్బే.. తాము అసలు అలాంటి హామీలే ఇవ్వలేదన్నట్టుగా గజినీని మించిపోయేలా నటించేస్తున్నారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అయితే వీరిని సోషల్ మీడియా మరిచిపోవడం లేదు. ప్రతీ హామీని గుర్తు చేస్తోంది. అయినప్పటికీ మభ్యపెట్టడం, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడంతోనే కాలం గడిపేస్తున్నారు. తాజాగా ఏడాది పాలనలో ఏదో ఉద్ధరించేశామన్నట్టు ‘సుపరిపాలన – తొలి అడుగు’ అంటూ కట్టుకథలు ఎన్నైనా చెప్పవచ్చని నిస్సిగ్గుగా ప్రజలకు వద్దకు వెళ్తున్నారు. కూటమి నాయకులు ఇచ్చిన కొన్ని హామీలను పరిశీలిస్తే...