
చంద్రబాబు హామీలు నీటి మూటలు
● పాతపట్నం నియోజకవర్గంలో ఐటీడీఎ, ప్రభు త్వ మహిళా డిగ్రీ కళాశాల,అగ్నిమాపక కేంద్రం, 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం.
● ఆమదాలవలస నియోజకవర్గంలో పురుషోత్తపురం వద్ద వంశధార నదిపై, ముద్దాడపేట వద్ద నాగావళి నదిపై వంతెన పనులు, నారాయణపు రం ఆనకట్ట ఆధునీకరణ పనులు పూర్తి చేస్తాం. వంశధార ప్రాజెక్టును పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేస్తాం.
● నియోజకవర్గానికొక ఇంజినీరింగ్ కళాశాల. పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు. కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు. జీడి పిక్కల 80 కిలోల బస్తా మద్దతు ధర రూ.16 వేలు చేస్తాం. ఆఫ్‌షోర్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. వంశధార కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు చేస్తాం. పలాసలో రైతు బజారు ఏర్పాటు. ఇవేవీ అమలుకాలేదు.
● వంశధార, నాగావళి నదులను అనుసంధానం, నరసన్నపేట పరిధిలో ఎత్తిపోతల పథకం పూర్తి, వంశధార– బాహుదా నదుల అనుసంధానం చేస్తామన్నా.. ఆ ఊసేలేదు.
● పలాసలో డిఫెన్స్ కోచింగ్ సెంటర్, టెక్కలిలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తాం. బుడగట్లపాలెంలో మత్స్యకార జెట్టీ నిర్మాణం చేస్తాం. పలాస–కాశీబుగ్గలో రైల్వే ఫ్లై ఓవర్ వంతెన పూర్తిచేస్తాం. కళింగ వైశ్యులను ఓబీసీలో చేర్చుతాం.
వీటిలో ఒక్కటంటే ఒక్కటీ అమలు కాలేదు.