
సైనికుడే నిజమైన దేశభక్తుడు
ఇచ్ఛాపురం రూరల్: దేశ రక్షణ వ్యవస్థలో పగలు, రాత్రి తేడా లేకుండా కంటిపై కునుకు లేకుండా దేశాన్ని కాపాడే సైనికుడే గొప్ప దేశభక్తుడని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. ఇచ్ఛాపురం మండలం టి.బరంపురం గ్రామానికి చెందిన తిప్పన పురుషోత్తంరెడ్డి 28 ఏళ్ల పాటు ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన నేపథ్యంలో మంగళవారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ నేటి యువతీ, యువకులు పురుషోత్తంరెడ్డి వంటి సైనికులను ఆదర్శంగా తీసుకొని దేశసేవకు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం, కంచిలి ఎంపీపీలు బోర పుష్ప, పైలా దేవదాసురెడ్డి, సర్పంచ్ కారంగి త్రినాథ్, ఒడిశా పాత్రపురం బ్లాక్ చైర్మన్ ఏదురు మోహనరావు, మాజీ ఎంపీపీ కారంగి మోహనరావు, మహతీ సాంస్కృతిక సేవా సంఘం అధ్యక్షుడు రంగాల జానకిరామ్, కళాకారులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.