
నేటి నుంచి ఇంటింటికీ రానున్న ప్రజాప్రతినిధులు
భయపడుతున్న ప్రజాప్రతినిధులు
ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో జనం ఎక్కడ నిలదీస్తారోనని కూటమి నేతలు కూడా భయపడుతున్నారు. ముఖ్యమంత్రేమో ఇంటింటికీ వెళ్లి చేసింది చెప్పుకోవాలని చెబుతుంటే, అసలు చేసిందేముందని ప్రజాప్రతినిధులు అభద్రతాభావంలో పడ్డారు. మరోవైపు ఎక్కడికక్కడ ఇసుక, లిక్కర్, రోడ్లు, సాగునీటి కాలువల అవకతవకలు, అక్రమాలు జరుగుతుండటంతో బహిరంగంగా ప్రశ్నిస్తారేమో, గుట్టు రట్టు చేస్తారేమో, బాగోతమంతా బయటపెడతారేమోనని ఆందోళన చెందుతున్నారు.
కొత్తవి లేవు.. ఉన్నవాటికి కోత
అధికారంలోకి వచ్చిన వెంటనే 50 ఏళ్లకే మహిళలకు పింఛన్ మంజూరు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆ ఊసే లేదు. చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం జిల్లాలో 3,07,537 మంది అర్హులు ఉన్నారు. కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న పింఛన్లు దాదాపు 12 వేల వరకు ఏడాది కాలంలో తీసేశారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
‘చంద్రబాబు.. పవన్ కల్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ–జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీలోని వాగ్దానాలను అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం’ ఎన్నికల ముందు ఇంటింటికీ తిరిగి ఇచ్చిన బాండ్లలో కూటమి నాయకులు చెప్పిన మాటలివి. ఓట్లు వేసి గెలిపించాక ఈ బాసను పూర్తిగా మర్చిపోయారు. పైగా ఏడాదిలో అన్నీ చేసేశామని చెప్పుకుంటూ నేటి నుంచి ఇంటింటికీ తిరగనున్నారు. జనం కూడా బాండ్ పేపర్లు పట్టుకుని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. తొలి అడుగులోనే ప్రశ్నించకపోతే మిగతా అడుగులు కూడా తప్పుగా పడతాయని జనం భావిస్తున్నారు.
దగా కాదా?
ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాది సంక్షేమ పథకాలకు పంగనామం పెట్టారు. రెండో ఏడాది తల్లికి వందనం పేరుతో కొందరికి మాత్రమే ఇచ్చి, దాంట్లో కూడా కోత పెట్టి మమ అనిపించారు. స్థానిక సమస్యలు మొదలు మేనిఫెస్టోలోని హామీల వరకు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టకపోగా గత ప్రభుత్వంలో మొదలు పెట్టిన, దాదాపు పూర్తి కావచ్చిన పనులను సైతం గాలికొదిలేశారు. దీంతో నాయకులకు నిలదీతల భయం పట్టుకుంది.
వెన్నుపోటే కదా..
వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ పథకాలు బంగారంలా అమలవుతుంటే.. రాష్ట్రం శ్రీలంకలా అయిపోతుందని భయపెట్టారు. వారు మాత్రం అవే హామీలు ఇచ్చి ఎన్నికలకు వెళ్లారు. సంపద సృష్టిస్తామని డాంబికాలు పలికి.. ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పాలంటూ నాలుక మడతేస్తున్నారు. ఎన్నికల ముందు 143 హామీలిచ్చి పట్టుమని ఐదు కూడా అమలు చేయకుండా జనాలకు వెన్నుపోటు పొడిచారు.
అన్నదాత సుఖీభవ ఏదీ..?
చంద్రబాబు చెప్పిన పెట్టుబడి సాయం కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతన్నలకు రూ. 20వేలు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గాలికొదిలేశారు. గత ఏడాది జిల్లాలో 3,14,212 మందికి సంబంధించి రూ.628.42కోట్లు మేర ఎగ్గొట్టారు. ఈ ఏడాదికి ఇంకా అతీగతి లేదు.
వాయిదాల ప్రయాణం
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఉచిత బస్సు ప్రయాణంపై ప్రకటన లేదు. తేదీలు మార్చుకుంటూ పోతున్నారు.
కొందరికే వందనం
తల్లికి వందనం పథకం గత ఏడాదికి సంబంధించి పూర్తిగా ఎగ్గొట్టేశారు. రెండో సంవత్సరం ప్రారంభమయ్యాక రూ.15వేలు కాదు రూ.13వేలు అని మాట మార్చేశారు. ఎంతమందికి ఇచ్చారో జిల్లా యూనిట్‌గా లెక్కే చెప్పడం లేదు. సవాలక్ష కార ణాలు చూపుతూ ఆపేశారు. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల సంఖ్య అధికారికంగా ప్రకటించడం లేదు.
అరకొర గ్యాస్
ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించారు. కానీ ఒకే సిలిండర్‌తో చేతులు దులుపుకున్నారు. రెండో సిలిండర్ డబ్బులు ఎంతమందికి పడ్డాయో వివరాలు చెప్పలేని స్థితిలో ఉన్నారు.
ఆడబిడ్డకు అన్యాయం
19 నుంచి 60ఏళ్ల లోపు మహిళలకు నెలకి రూ.1500 ఇస్తామని చెప్పారు. ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి రూ.1500 చొప్పున అందజేస్తామని చెప్పారు. జిల్లాలో ఈ పథకం కింద 7,59,692 మంది అర్హులై ఉన్నారు. వీరంతా తమకు రూ.1500 ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఒక సంవత్సరానికి సంబంధించి రూ. 113.95కోట్ల మేర కోల్పోయారు.
విద్యార్థులకు ఫీజు కష్టాలు
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదు. వసతి దీవెన, విద్యా దీవెన అందించలేదు. జిల్లాలో 45,657మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.107 కోట్ల వరకు ప్రభుత్వం బకాయిలు పడి ఉంది. వసతి దీవెన సంగతి దేవుడెరుగు.
పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన పి.రమణరావుకు ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు అందజేసిన బాండు ఇది. ఆడబిడ్డ నిధి కింద రూ.18వేలు, తల్లికి వందనం కింద రూ.15వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు చొప్పున సంవత్సరానికి రూ.53వేలు, ఐదేళ్లకు గాను రూ.2లక్షల 65వేలు ఇస్తామని బాండులో రాసిచ్చారు. 2024–25లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
భృతి ఎక్కడ..?
ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగం వచ్చే వరకు నెలకి రూ.3వేల భృతి ఇస్తాం అంటూ ప్రకటించిన చంద్రబాబు అండ్ కో ఆ ఊసే మర్చిపోయారు. ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. 7,28,210 మందికి రూ. 218.46కోట్ల మేర ఇవ్వకుండా మొండి చేయి చూపారు. రెండో ఏడాది కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా వలంటీర్లు, ఎండీయూ ఆపరేట ర్లు, అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజనం ఆయా లు, వైద్య శాఖలో తాత్కాలిక ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర చిరుద్యోగులను తీసేశారు.
కూటమి నేతల్లో ఆందోళన
తొలి అడుగు పేరుతో ప్రజల్ని కలవనున్న నేతలు
చేసింది చెప్పాలంటున్న చంద్రబాబు
చేసిందేముందంటున్న నాయకులు
ఏడాది దాటినా అమలుకు నోచుకోని హామీలు
ముందుకు సాగని
అభివృద్ధి పనులు

నేటి నుంచి ఇంటింటికీ రానున్న ప్రజాప్రతినిధులు

నేటి నుంచి ఇంటింటికీ రానున్న ప్రజాప్రతినిధులు

నేటి నుంచి ఇంటింటికీ రానున్న ప్రజాప్రతినిధులు

నేటి నుంచి ఇంటింటికీ రానున్న ప్రజాప్రతినిధులు

నేటి నుంచి ఇంటింటికీ రానున్న ప్రజాప్రతినిధులు

నేటి నుంచి ఇంటింటికీ రానున్న ప్రజాప్రతినిధులు

నేటి నుంచి ఇంటింటికీ రానున్న ప్రజాప్రతినిధులు

నేటి నుంచి ఇంటింటికీ రానున్న ప్రజాప్రతినిధులు