
శ్రీకాకుళం
బుధవారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2025
పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన పి.నాగభూషణరావుకు ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు ఇచ్చిన బాండు ఇది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంయుక్తంగా సంతకాలు కూడా చేశారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ పేరుతో ఇచ్చిన బాండులో నాగభూషణరావుకు ఆడబిడ్డ నిధి కింద రూ.18వేలు, తల్లికి వందనం కింద తన ఇద్దరు పిల్లలకు గాను రూ.30వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు చొప్పున సంవత్సరం మొత్తానికి రూ.68వేలు, ఐదేళ్లకు గాను రూ. 3లక్షల 40వేలు ఇస్తానని ఆ బాండులో రాసిచ్చారు. కానీ నాగభూషణరావుకు తొలి ఏడాది(2024–25)లో నయాపైసా ఇవ్వలేదు. తల్లికి వందనం కింద తన ఇద్దరు పిల్లలకు రావాల్సిన రూ. 30వేలు కూడా కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టేసింది.
న్యూస్‌రీల్