
● జ్వరాల వలస!
గ్రామంలో వైద్యసేవలను అందిస్తున్న దృశ్యం
● టీడీవలసలో ప్రతి ఇంటా జ్వరాలు
జి.సిగడాం: మండలంలోని టంకాల దిగ్గువలస గ్రామానికి జ్వరం వచ్చింది. గ్రామంలో ఏ ఇంట చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. పది రోజుల నుంచి వంద మందికిపైగా జ్వరాల బారిన పడ్డారు. జ్వరంతో పాటు కాళ్ల పొంగులు, దురదలు కూడా కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. డాక్టర్ బుడుమూరు యశ్వంత్, పేకల సుమబిందు, స్థానిక ఏఎన్‌ఎం చిన్ని, ఎంఎల్‌హెచ్‌పీ దివ్యరాజేశ్వరితోపాటు సిబ్బందితో వైద్యసేవలను అందిస్తున్నారు. ప్రజలు తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతానికి జ్వర పీడితుల సంఖ్య తగ్గుతోందని వైద్యాధికారి యశ్వంత్ తెలిపారు. డెంగీ, మలేరియా కేసులు లేవని పేర్కొన్నారు. పది మంది మాత్రమే జ్వర పీడితులు ఉన్నారని, మిగిలిన వారు కోలుకున్నారని వెల్లడించారు.

● జ్వరాల వలస!