
‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ విజయవంతం చేయండి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ చేపట్టబోయే ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమం గురువారం శ్రీకాకుళం నగరంలో అరసవల్లి రోడ్డులోని సన్‌రైజ్ హోటల్ వద్ద జరగనుందని వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరు తూ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయ కులతో సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ సభ విజయవంతం చేయడమే మనందరి లక్ష్యమని అన్నారు. కార్యక్రమానికి జిల్లాలోగల అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ ముఖ్య నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు పార్టీ ముఖ్య నాయకులు హాజరవ్వాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, తూర్పుకాపు కుల రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, కళింగవైశ్యకుల రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, గ్రీవెన్స్‌సెల్ అధ్యక్షులు రౌతు శంకరరావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, ఆరంగి మురళి, చిట్టి జనార్ధన, ఎన్ని ధనుంజయరావు, వైవీ శ్రీధర్, చింతు రామారావు, అంబటి శ్రీనివాసరావు, బొబ్బది ఈశ్వరరావు, పొన్నాడ రుషి, ముంజేటి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.