
● మా బడిని కాపాడండి
బూర్జ: మండలంలో గల వైకుంఠపురం గ్రామ ప్రాథమిక పాఠశాలను వేరే పాఠశాలకు తరలించవద్దని గ్రామ సర్పంచ్ బొడ్డేపల్లి వెంకట సత్యంతో పాటు పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. 3, 4, 5 తరగతులను ఉప్పినివలస గ్రామంలో గల ప్రైమరీ మోడల్ స్కూల్‌కు తరలించారని వారు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హైవే క్రాసింగ్, కెనాల్ క్రాసింగ్ కారణాల వల్ల నిలుపుదల చేశారన్నారు. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాఠశాలను తరలించే ప్రయత్నం చేస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పాఠశాల హెచ్‌ఎం విధుల్లో ఉండగానే నిరసన చేపట్టారు. వైకుంఠపుర పంచాయతీతోపాటు గ్రామాలు బొడ్డపాడు, గిరిజన గ్రామం అల్లెపల్లి గూడ ఉన్నాయన్నారు. శ్రీకాకుళం–పాలకొండ ప్రధాన రహ దారి దాటి పాఠశాలకు విద్యార్థులు ఎలా వెళ్తార ని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. సర్పంచ్ విద్యాకమిటీ చైర్‌పర్సన్ టి.హైమావతి ఆధ్వర్యంలో నినాదాలు చేశారు.