శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): దళిత పాస్టర్, సామాజికవేత్త ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించిన బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం అంబేడ్కర్ కూడలిలో దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, మాన వ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వి. జగన్నాథం,సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కళ్లేపల్లి రామ్ గోపాల్ మాట్లాడుతూ నిందితులను శిక్షించడంతో పాటు బాధిత కుటుంబాన్ని ప్రభు త్వం ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు బోసు మన్మధరావు, డేనియల్, అనంతరావు, సుధాకర్, రాంబాబు, రమణ, జాన్, కోటి, గోవింద్, శ్యామ్, ఈశ్వరరావు పాల్గొన్నారు.