లండన్‌ మ్యాగ్‌జైన్‌లో కుప్పిలి కవితకు స్థానం | Sakshi
Sakshi News home page

లండన్‌ మ్యాగ్‌జైన్‌లో కుప్పిలి కవితకు స్థానం

Published Tue, May 28 2024 10:40 AM

-

ఆమదాలవలస రూరల్‌: లండన్‌కు చెందిన తెలుగు ఆసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ (తాల్‌) ఉగాది సందర్భంగా విడుదల చేసిన మా తెలుగు 2024 వార్షిక సంచికలో ఆమదాలవలసకు చెందిన కవి కుప్పిలి వెంకటరాజా రావు రచించిన కవితకు స్థానం లభించింది. కుప్పిలి రచించిన తనివితీరని తావి– తెలుగు అనే కవితకు స్థానం వచ్చినట్లు లండన్‌ సంపాదకులు నెల్లుట్ల సునీత మొయిల్‌ ద్వారా సమాచారం తెలియజేశారని కవి రాజారావు సోమవారం తెలిపారు. భారతరత్న పీవీ నరసింహారావు ముఖచిత్రంతో విడుదల చేసిన ఈ సంచికను ఆస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్‌ ఆవిష్కరించారని తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement