తెప్పోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

తెప్పోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

Published Sun, Nov 19 2023 12:48 AM

తెప్పోత్సవ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరిస్తున్న పాలకమండలి సభ్యులు  - Sakshi

అరసవల్లి: కార్తీక క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా ఈ నెల 24న ఆదిత్యుని హంసనావికోత్సవానికి (తెప్పోత్సవం) భారీగా భక్తులు వచ్చే అ వకాశమున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆలయ పాలకమండలి సభ్యులు తెలియజేశారు. స్థానిక అనివేటి మండపంలో ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్‌, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మల సమక్షంలో తెప్పోత్సవ ఆహ్వాన పత్రికలను శనివారం వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుష్కరిణి పరిసరాలన్నీ ఆకర్షణీయంగా ఉండాలని, ఎక్కడా ఇబ్బందులు లేకుండా భక్తులకు స్వామి జలవిహార దర్శనం కలిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పుష్కరిణిలో నీటి నిల్వ అధికంగా ఉన్న నేపథ్యంలో భక్తుల కు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బారికేడ్ల ను చుట్టుపక్కల ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఈఓ వి.హరిసూర్యప్రకాష్‌, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, పాలకమండలి సభ్యులు మండవిల్లి రవి, ఎన్‌.కోటేశ్వ రచౌదరి, ద్వారపు అనూరాధ, లుకలాపు గోవిందరావు, జలగడుగుల శ్రీనివాస్‌, దుక్క గనిరాజు, జోగి మల్లెమ్మ, మైలపల్లి లక్ష్మి, ఆలయ సూపరింటెండెంట్‌ కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

22న జాబ్‌, అప్రెంటిస్‌ మేళా

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 22వ తేదీన జాబ్‌మేళా, అప్రెంటిస్‌ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ ఎల్‌.సుధాకర్‌రావు తెలిపారు. ఆ ప్రకటనలో శనివారం వివరాలు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు అభ్యర్థులు హాజరు కావాలని అన్నారు. మేధా సర్వో డ్రైవ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (హైదరాబాద్‌) ఈ ఎంపికలు నిర్వహిస్తుందని అన్నారు. ఐటీఐ ట్రేడులు ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానికల్లో ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఫిట్టర్‌లో 120, ఎలక్ట్రీషియన్‌లో 120, ఎలక్ట్రానిక్స్‌ మెకానికల్‌లో 50 అప్రెంటిస్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. నైపుణ్యం బట్టి ఉద్యోగాల కల్పన ఉంటుందని చెప్పారు. స్టైఫండ్‌ రూ. 14,215, ఈఎస్‌ఈ సౌకర్యం, ఓటీ రెన్యూమరేషన్‌ అందజేస్తారని వివరించారు. అభ్యర్థులు 25 ఏళ్ల లోపు వారై ఉండాలని, ఒరిజనల్‌, జిరాక్స్‌ కాపీలతో హాజరు కావాలని చెప్పారు.

తాడివలస విద్యార్థినికి రూ.50వేలు ఉపకార వేతనం

పొందూరు: మండలంలోని తాడివలస జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థిని గురుగుబెల్లి ఢిల్లీశ్వరికి రూ.50 వేల ఉపకార వేతనానికి సంబంధించిన చెక్కును హెచ్‌ఎం బల్ల కంటయ్య శనివా రం అందజేశారు. అమెరికాలోని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో ఏడాదికి రూ. 25 వేలు చొప్పున రెండేళ్లకు రూ. 50 వేల చెక్కును పంపించారు. గతంలో ఢిల్లీశ్వరి స్వామి వివేకానంద స్ఫూర్తిదాయక ప్రసంగానికి మెచ్చుకొని ఈ ఉపకార వేతనాన్ని ప్రకటించారు. కరోనా సమయంలో ఢిల్లీశ్వరి తండ్రి మరణించిన విషయం తెలుసుకున్న తానా ప్రతినిధులు రామ్‌చౌదరి, సంజన ఉప్పలూరి, రేఖ ఉప్పలూరి తదితరులు ఢిల్లీశ్వరిని దత్తత తీసుకుని చదివించడంతో పాటు ఏటా రూ. 25 వేలను స్కాలర్‌షిప్‌ రూపంలో అందజేస్తూ వస్తున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పూజారి హరిప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

రూ. 50 వేలు చెక్కును అందుకుంటున్న విద్యార్థిని గురుగుబెల్లి ఢిల్లీశ్వరి
1/1

రూ. 50 వేలు చెక్కును అందుకుంటున్న విద్యార్థిని గురుగుబెల్లి ఢిల్లీశ్వరి

Advertisement
 

తప్పక చదవండి

Advertisement