ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

Published Sat, Nov 11 2023 12:38 AM

-

ఆమదాలవలస: ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట ఫుడ్‌ కమిషన్‌ సభ్యులు బి.కాంతారావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు శుక్రవారం ఆమదాలవలస పట్టణంలో మొ బైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్లు (ఎండీయూ) వాహనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పట్టణంలోని ఐజే నాయుడు కాలనీలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే లక్ష్మీ టాకీస్‌, ఐజేనాయుడు కాలనీలో ఉన్న చౌక ధరల దుకాణాలను పరిశీలించారు. లక్ష్మీ నగర్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఫోర్టిఫైడ్‌ రైస్‌పై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలన్నారు. ఈ రకం బియ్యం తింటే శరీరానికి పోషకాలు అందుతాయన్నారు. ఫోర్టిఫైడ్‌ బియ్యం అమ్మడం, కొనడం చెయ్యకూడదని ఆయన అన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement