రంగోయి గ్రామం పరిశీలన | Sakshi
Sakshi News home page

రంగోయి గ్రామం పరిశీలన

Published Fri, Nov 10 2023 4:54 AM

రంగోయి క్రీడా మైదానాన్ని పరిశీలించి 
చిత్రీకరిస్తున్న ఆర్డీఓ భరత్‌ నాయక్‌ 
 - Sakshi

కాశీబుగ్గ: పలాస మండలం మామిడిమెట్టు పంచాయతీ రంగోయి గ్రామాన్ని పలాస రెవిన్యూ డివిజనల్‌ అధికారి భరత్‌నాయక్‌ గురువారం సందర్శించారు. ఈ నెల 23వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పలాసలో కిడ్నీ ఆస్పత్రి, డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార పథకాన్ని ప్రారంభించనున్నారు. పథకాల పరిశీలనలో భాగంగా పలాస మండలంలో ఉన్న రామకృష్ణాపురం, రంగోయి గ్రామాలను ప్రతిపాదించడంతో వాటిని పరిశీలించి అక్కడి పరిస్థితులను కెమెరాలో బంధించి ఉన్నత అధికారులకు పంపించారు. ఆయనతో పాటు పలాస తహసీల్దార్‌ లంబాల మధుసూదనరావు తదితరులు ఉన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement