సర్కారు మంచి మనసు | Sakshi
Sakshi News home page

సర్కారు మంచి మనసు

Published Fri, Nov 10 2023 4:52 AM

శ్రీకాకుళం భవిత కేంద్రం 
 - Sakshi

శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ.. దృష్టి లోపం, వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరికి ట్యాబ్‌లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సమగ్రశిక్షణ చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో లెనోవా, శాంసంగ్‌ ట్యాబ్‌లను పంపిణీ చేయాలని భావించింది.

జిల్లాకు చేరుకున్న 241 ట్యాబ్‌లు..

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లు కలిగిన 241 ట్యాబ్‌లు స్టేట్‌ ప్రాజెక్ట్‌ సమగ్రశిక్ష కార్యాలయం నుంచి జిల్లాకు చేరుకున్నాయి. ఇందులో 80 భవిత కేంద్రాల్లో టీచర్లకు అందజేయనుండగా, మిగిలిన 161 ట్యాబ్‌లను దృష్టిలోపం, వినికిడి లోపం ఉన్నవారికి అందజయనున్నారు.

అర్హులు ఎవరంటే..?

ప్రభుత్వ పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి చదువుతూ దృష్టిలోపం/వినికిడి లోపం ఉన్న విద్యార్థులు, అలాగే 7 నుంచి 10వ తరగతి చదువుతు వినికిడి లోపం ఉన్నవారు ట్యాబ్‌లు అందుకోవడానికి అర్హులు. ఈ రెండు కేటగిరీల కలిగిన విద్యార్థులు సదరం సర్టిఫికెట్‌ కలిగి ఉండాల్సి ఉంటుంది. అయితే వీరిలో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులలో గత ఏడాది బైజూస్‌ ట్యాబ్‌లు తీసుకున్న విద్యార్థులు అనర్హులని జిల్లా సమగ్రశిక్ష అధికారులు వివరించారు.

భవిత కేంద్రాలను సంప్రదించాలి

దృష్టి, వినికిడి లోపం కలిగి.. అర్హత కలిగిన దివ్యాంగ విద్యార్థులు వారి వారి మండలాల్లో గల భవిత కేంద్రాన్ని సంప్రదించాలి. సదరం సర్టిఫికెట్‌ను సిద్ధం చేసుకోవాలి. అనంతరం అర్హులైన దివ్యాంగులకు కలెక్టర్‌ చేతులమీదుగా ట్యాబ్‌లను పంపిణీచేస్తాం.

– డాక్టర్‌ రోణంకి జయప్రకాష్‌,

ఏపీసీ సమగ్రశిక్ష శ్రీకాకుళం

దృష్టి, వినికిడి లోపం ఉన్నవారికి సర్కారు బాసట

లెనోవా, శాంసంగ్‌ ట్యాబ్‌ల

అందజేతకు నిర్ణయం

జిల్లాకు చేరుకున్న 241 ట్యాబ్‌లు

1/1

 
Advertisement
 
Advertisement