పేదలకు కార్పొరేట్ ఉచిత వైద్యం అందించడంతో పాటు నిరుపేద
పుట్టపర్తి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. పార్టీలకు అతీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు కోటి సంతకాల సేకరణలో భాగస్వాములవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి స్వచ్ఛందంగా కదలి వస్తున్నారు.
దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా...
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు ఉండగా, 2019లో వైఎస్ జగన్ అధికారంలో చేపట్టాక ఒకేసారి 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో 5 మెడికల్ కళాశాలలను 2023–24లో గత ప్రభుత్వంలోనే ప్రారంభించారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు మన విద్యార్థులకు అదనంగా వచ్చాయి. అయితే గతేడాది పాలన పగ్గాలు చందబ్రాబు చేతుల్లోకి వెళ్లడంతో వైద్య కళాశాలలకు గ్రహణం పట్టుకుంది. విద్యార్థుల ఎంబీబీఎస్ కల కల్లగా మారే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో పెద్ద ఎత్తున్న ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, శ్రేణులు అక్టోబర్ 10 నుంచి ఊరూరా రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్వాకాన్ని ప్రజలకు వివరించారు. దీంతో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ అన్ని వర్గాల ప్రజలు సంతకాలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీ చరణ్‌తో సహా పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, రాప్తాడు, హిందూపురం, మడకశిర పార్టీ సమన్వయకర్తలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మక్బూల్, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, దీపిక, ఈరలక్కప్ప ఆయా నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ ముమ్మరంగా చేపడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలు వెల్లువలా ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తూ.. తమ మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ 3 లక్షల వరకు సంతకాల సేకరణ పూర్తి చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజల నుంచి సేకరించిన సంతకాల పేపర్లను పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్‌కు అందజేయనున్నారు.
మాది వ్యవసాయ కుటుంబం. డాక్టర్ కావాలన్నది నా తమ్ముడి కల. బాగానే కష్టపడి చదివాడు. మూడు మార్కుల తేడాతో సీటు కోల్పోయాడు. మేనేజ్‌మెంట్ కోటాలో చదివేంత స్థోమత మాకు లేదు. వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన మెడికల్ కళాశాలలన్నీ అందుబాటులోకి వచ్చి ఉంటే సీట్లు పెరిగి నా తమ్ముడు కల నెరవేరేది. కానీ చంద్రబాబు సర్కార్ ‘ప్రైవేటు’ మంత్రం జపిస్తోంది. దీంతో నిరుపేద కుటుంబాల్లోని ఎందరో యువకులు.. తమ జీవితకాల స్వప్నాన్ని సాకారం చేసుకోలేకపోయారు. అందుకే మెడికల్ కళాశాలలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగాలన్నది నా కోరిక. అందుకే వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నా.
మా అమ్మకు 60 ఏళ్లు. ఏడాది క్రితం కింద పడగా తలకు గాయమైంది. ఆస్పత్రికి తీసుకెళ్తే న్యూరోసర్జన్ లేడన్నారు. బెంగళూరుకు తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. అక్కడి వెళ్తే తలలో రక్తం గూడు కట్టిందని రూ.6 లక్షలు తీసుకుని వైద్యం చేశారు. అప్పుడు చేసిన అప్పునకు వడ్డీ ఇంకా కడుతూనే ఉన్నా. పెనుకొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల అందుబాటులోకి వచ్చి ఉంటే మాలాంటి ఎందరో పేదలకు మేలు జరిగేది. కానీ చంద్రబాబు సర్కార్ ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తోంది. నిర్మాణం ప్రారంభమైన మెడికల్ కళాశాలలను ప్రైవేటు అప్పగించేందుకు సిద్ధమైంది. దీన్ని మేం ఒప్పుకోం. మా కోసం పోరాడుతున్న వైఎస్సార్ సీపీకే నా మద్దతు.
– మడకశిరకు చెందిన
ఓ యువకుడి ఆక్రందన ఇది
ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తాం
పేదలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు, నిరుపేద కుటుంబాల్లోని యువకుల డాక్టర్ కల నెరవేర్చేందుకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తన హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. జగన్‌పై అక్కసుతో వాటిని కార్పొరేట్ వ్యక్తులు, సంస్థలకు కట్టబెట్టేందుకు పూనుకుంది. దీన్ని నిరసిస్తూ జిల్లా పెద్ద ఎత్తున కోటి సంతకాలు, రచ్చబండ కార్యక్రమాలు చేపట్టాం. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తాం.
– ఉషశ్రీ చరణ్,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై
వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమం
చందబ్రాబు సర్కారు తీరుకు
నిరసనగా పోరుబాట
ఊరూరా సంతకాల సేకరణ,
రచ్చబండ
స్వచ్ఛందంగా మద్దతు తెలిపిన
సకల జనులు
ఇప్పటికే జిల్లాలో దాదాపు 3 లక్షల
సంతకాల సేకరణ పూర్తి
– పెనుకొండకు చెందిన
ఓ యువతి మాటలివి
పేదలకు కార్పొరేట్ ఉచిత వైద్యం అందించడంతో పాటు నిరుపేద
పేదలకు కార్పొరేట్ ఉచిత వైద్యం అందించడంతో పాటు నిరుపేద
పేదలకు కార్పొరేట్ ఉచిత వైద్యం అందించడంతో పాటు నిరుపేద
పేదలకు కార్పొరేట్ ఉచిత వైద్యం అందించడంతో పాటు నిరుపేద


