బాబయ్య సేవలో ఎస్పీ
న్యూస్‌రీల్
పెనుకొండ: ఎస్పీ సతీష్‌కుమార్ శనివారం రాత్రి బాబయ్య స్వామి సేవలో గడిపారు. బాబయ్య స్వామి ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకుని స్వామికి చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతకుముందు చాదర్ తలపై ఉంచుకుని దర్గా వద్దకు చేరుకున్న ఎస్పీకి పీఠాధిపతి తాజ్‌బాబా, ఆయన కుమారుడు సలావుద్దీన్‌బాబా, దాదు, మత పెద్దలు... ఫక్కీర్ల విన్యాసాల నడుమ స్వాగతం పలికారు. ఎస్పీ వెంట డీఎస్పీ నర్సింగప్ప, సీఐ రాఘవన్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ కమిటీల్లో
జిల్లా వాసులకు చోటు
పుట్టపర్తి టౌన్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీల్లో పలువురు జిల్లా వాసులకు చోటు దక్కింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ సంఘాల రాష్ట్ర కమిటీలో జిల్లా వాసులకు చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పి.శ్రీకాంత్‌రెడ్డి (ధర్మవరం), సోషియల్ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా బి.వేణుగోపాల్‌రెడ్డి (హిందూపురం), పంచాయతీ వింగ్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్. నాగభూషన్‌రెడ్డి (మడకశిర), మున్సిపల్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఎల్. కృపాకర్‌రెడ్డి (కదిరి), సంయుక్త కార్యదర్శులుగా మహమ్మద్ హజీఫుల్లా (హిందూపురం), రెహానా (మడకశిర)ను నియమించారు. అలాగే కళాకారుల విభాగం పుట్టపర్తి నియోజవర్గ అధ్యక్షునిగా మంగలి రమేష్, ఎస్టీ సెల్ అధ్యక్షునిగా శివనాయక్, మడకశిర నియోజవర్గ వైఎస్సార్ టీఎఫ్ అధ్యక్షునిగా కృష్టమూర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


