కమనీయం.. బ్రహ్మోత్సవం
● వైభవంగా భక్తరపల్లి లక్ష్మీనరసింహు స్వామి బ్రహ్మోత్సవాలు
● ఆకట్టుకున్న భూతప్ప, జ్యోతుల ఉత్సవాలు
● వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన జనం
మడకశిర రూరల్: జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం భూతప్ప, జ్యోతులు ఉత్సవాలు నిర్వహించగా... ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించకున్నారు.
భక్తిశ్రద్ధలతో భూతప్ప ఉత్సవం..
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన భూతప్ప ఉత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది. భూతప్పల పాదస్పర్శతో తమ బాధలు, వ్యాధులు, సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే సంతానం లేని మహిళలు, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు మడికట్టుకుని భూతప్పలు వచ్చే దారిలో పడుకున్నారు. భూతప్పల పాదస్పర్శతో పులకించిపోయారు.
స్వామివార్లకు జ్యోతుల సమర్పణ..
తెల్లవారుజామునే వందలాది మంది మహిళలు బియ్యపు పిండి, బెల్లంతో తయారు చేసిన జ్యోతులను తీసుకువచ్చి భక్తరపల్లి, జిల్లేడుగుంట ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివార్లకు సమర్పించారు. ఇక పొంజుతో తలపై కొట్టించుకుంటే కష్టాలు తీరుతాయనే నమ్మకంతో భక్తులు పొంజుతో తలపై కొట్టించుకోవడానికి ఎగబడ్డారు.
కమనీయం.. బ్రహ్మోత్సవం
కమనీయం.. బ్రహ్మోత్సవం
కమనీయం.. బ్రహ్మోత్సవం


