మొక్కుబడి తంతు
పుట్టపర్తి: జిల్లాలో శుక్రవారం నిర్వహించన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పీటీఎం) మొక్కుబడి సాగింది. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమావేశాలకు హాజరు కాలేదు. ఇక వేదికలపై ఆశీనులైన టీడీపీ నాయకులు రాజకీయ ప్రసంగాలు చేయడంతో వచ్చిన వారు కూడా కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు.
ప్రొటోకాల్‌కు మంగళం..
మెగా పీటీఎంలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. చాలా చోట్ల స్థానిక ప్రజా ప్రతినిధులను ఆహ్వానించలేదు. ప్రస్తుతం సర్పంచ్‌లు, ఎంపీటీసీలుగా ఉన్న వారంతా వైఎస్సార్ సీపీకి చెందిన వారు, మద్దతుదారులు కావడంతో వారికి సమాచారం కూడా ఇవ్వలేదు.
రాజకీయ సభల్లా ప్రసంగాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన మెగా పీటీఎంను టీడీపీ నాయకులు రాజకీయం చేశారు. అర్హత లేకపోయినా చాలా మంది వేదికలపైకి ఎక్కి దర్బారు చూపారు. టీడీపీకీ చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మండల కన్వీనర్లు ఇతర ప్రజా ప్రతినిధులు మైకు అందుకుని కార్యక్రమ ఉద్దేశాన్ని మరచి రాజకీయ ప్రసంగాలు చేశారు. అభం శుభం తెలియని పిల్లల మనస్సులోకి పచ్చ విషం చొప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరకు పాఠశాలల అభివృద్ధికి ఎలాంటి తీర్మానాలు చేయకుండానే సమావేశాలు ముగించారు.
మెనూ పాటించలేదని ప్రిన్సిపాల్‌తో వాగ్వాదం
తనకల్లు గిరిజన గురుకుల పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌లో వాగ్వాదానికి దిగారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదని మండిపడ్డారు. ఇలాగైతే తమ పిల్లలను ఎలా పాఠశాలకు పంపేది లేదన్నారు.
రాజకీయ సభలా పీటీఎం..
పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి ఏపీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రాజకీయ సభలా మారింది. టీడీపీ నాయకుల కోసం సమావేశాన్ని 12 గంటల సమయంలో ప్రారంభించగా...తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమం 11 గంటలకు ప్రారంభమైతే తదుపరి పిల్లలతో గడిపి యోగక్షేమాలను అడిగి తెలుసుకుందామని సుదూర ప్రాంతాల నుండీ వచ్చిన తల్లిదండ్రులు పిల్లలను కలవలేక ఇబ్బందులకు గురయ్యారు. ఇక టీడీపీ కన్వీనర్‌తో పాటూ ఫైవ్‌మెన్ కమిటీ సభ్యులు, టీడీపీ మాజీ జెడ్పీటీసీ, పలువురు మాజీ ఎంపీటీసీలు వేదికపై ఆశీనులై రాజకీయ ప్రసంగాలు చేశారు. దీంతో విసిగిపోయిన చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు బయటికెళ్లిపోయారు. ఓపికతో ఉన్న ఒకరిద్దరు ఏపీఆర్‌ఎస్‌లో మౌలిక వసతుల లేమిపై ప్రస్తావించారు. ఎన్‌సీసీలో జరిగిన ఆక్రమాలు, పిల్లల ఖాతాలో జమ కావాల్సిన డబ్బుల దుర్వినియోగం గురించి మాట్లాడారు. ఇప్పటికై నా కమిటీ సభ్యులు పాఠశాల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
తూతూ మంత్రంగా మెగా పీటీఎం
రాజకీయ ప్రసంగాలు చేసిన
టీడీపీ నాయకులు
సమస్యలు ప్రస్తావించినా
వినే వారే కరువు
మొక్కుబడి తంతు


