అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టండి | - | Sakshi
Sakshi News home page

అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టండి

Dec 2 2025 7:48 AM | Updated on Dec 2 2025 7:48 AM

అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టండి

అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టండి

ప్రశాంతి నిలయం: ధర్మవరం మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని కలెక్టర్‌ను పాలక మండలి సభ్యులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ను కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. ధర్మవరంలో మున్సిపల్‌ అధికారులు, అధికార పార్టీ నాయకులు కుమ్మకై ్క ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని చైర్‌పర్సన్‌ కె.లక్ష్మి, వైస్‌ చైర్మన్లు జయరామిరెడ్డి, శంషాద్‌బేగం, పలువురు కౌన్సిలర్లు కోరారు. అధికారులు ప్రతి పనికీ ఒక రేటు నిర్ణయించి నిలువుదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కేతిరెడ్డి సూర్యప్రతాప్‌రెడ్డి తాగునీటి పథకంలో కమిషనర్‌, మేనేజర్‌ కుమ్మకై ్క మోటారు మరమ్మతులు, డీజిల్‌ బిల్లులు రూపంలో రూ.40 లక్షలు కాజేశారన్నారు. అనధికార లేఅవుట్లకు రూ.లక్షల్లో డబ్బు దండుకుంటున్నారని ఆరోపించారు. డ్రెయినేజీల పేరుతో అరకొర పనులు చేసి రూ.93 లక్షలు బిల్లు చేసుకున్నారన్నారు. రేగాటిపల్లి జగన్న కాలనీ, పోతులనాగేపల్లి, కుణుతూరు జగన్న కాలనీలను విలీనం చేయాలని మున్సిపల్‌ అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని విన్నవించారు. కాగా, పరిష్కార వేదికకు 244 వినతులు అందాయి. జేసీ మౌర్య భరద్వాజ్‌, డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ వినతులు స్వీకరించారు.

చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

వికలాంగుల హక్కుల చట్టం– 2016పై అన్ని శాఖల అధికారులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని నిర్వహించిన ప్రరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా విజువల్లి చాలెంజ్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వికలాంగులు హక్కుల చట్టం–2016పై తెలుగు అనువాద పుస్తకాన్ని వివిధ శాఖల అధికారులతో కలసి కలెక్టర్‌ ఆవిష్కరించారు. వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి అర్చన, విభిన్న ప్రతిభావంతుల ఉద్యోగుల అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

అనాథల ఆరోగ్యానికి ‘అమృత’ భరోసా

వృద్ధాశ్రమాల్లోని వృద్ధులు, అనాథ శిశువులకు ఉచిత వైద్య చికిత్సలు అందించే అమృత హెల్త్‌ స్కీమ్‌ కార్డులను కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అందజేశారు. సోమవారం కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా పరిధిలోని రిజిస్టర్డ్‌ అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన 55 మంది అనాథలకు, 117 మంది వృద్ధులకు మొత్తం 172 మందికి అమ్మృత స్కీమ్‌ కార్డులను అందజేశారు. అలాగే జిల్లాలోని మూడు ప్రభుత్వ బాలసదనాలు, ఆరు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలసదనాలకు రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌లను కలెక్టర్‌ అందజేశారు. ఎన్టీఆర్‌ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ శ్రీదేవి, జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ సువర్ణ, డీఎంఅండ్‌హెచ్‌ఓ ఫైరోజా బేగం, డిసీహెచ్‌ఎస్‌ మధుసూదన్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

● జిల్లాలో పీఎం ధన ధాన్య కృషి యోజనను సంపూర్ణంగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పథకం అమలు పురోగతిపై కలెక్టర్‌ సమీక్షించారు.

కలెక్టర్‌కు ధర్మవరం మున్సిపల్‌

పాలకవర్గం ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement