25 మండలాల్లో కరువు
పుట్టపర్తి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. 2025 ఖరీఫ్‌కు సంబంధించి జిల్లాలోని 25 మండలాలను కరువు జాబితాలో చేర్చింది. తీవ్ర కరువు బారిన పడిన మండలాల్లో అమడగూరు, గాండ్లపెంట, హిందూపురం, మడకశిర, ముదిగుబ్బ, ఎన్‌పీ కుంట, ఓడీచెరువు, రామగిరి, రొళ్ల, తలుపుల, తనకల్లు తదితర 12 మండలాలున్నాయి. ఇక మోస్తరు కరువు ప్రభావిత మండలాల జాబితాలో అమరాపురం, బత్తలపల్లి, బుక్కపట్నం, ధర్మవరం, గుడిబండ, కదిరి, కనగానపల్లి, కొత్తచెరువు, లేపాక్షి, నల్లచెరువు, నల్లమాడ, పుట్టపర్తి, సోమందేపల్లి తదితర 13 మండలాలను చేర్చారు. తీవ్ర వర్షాభావం, భూగర్భ జల మట్టం, పంట నష్టం వివరాలతో కలెక్టర్ పంపిన నివేదిక ఆధారంగా కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది.
కల్లు డిపోల్లో
నమూనాల సేకరణ
హిందూపురం టౌన్: కల్తీకల్లుతో చౌళూరు వాసులు అస్వస్థతకు గురయ్యాక ఎకై ్సజ్ అధికారులు మేల్కొన్నారు. శనివారం ఎకై ్సజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య ఆధ్వర్యంలో సిబ్బంది హిందూపురం, లేపాక్షిలో ఉన్న కల్లు డిపోల్లో తనిఖీలు చేపట్టారు. పట్టణంతో పాటు, లేపాక్షి మండలం పులమతి గ్రామంలో ఉన్న కల్లు డిపోల్లో నమూనాలు సేకరించారు. వీటిని చిత్తూరు కెమికల్ ల్యాబ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. అలాగే కల్తీ కల్లు అరికట్టేలా కల్లు అమ్మకందారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కల్తీ కల్లు తయారు చేసినా, విక్రయించినా పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. అలాగే కల్లు తాగే వారితో సమావేశమై కల్లు తాగడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు.


