
సమాచారం కోరితే ఇవ్వాల్సిందే
పుట్టపర్తి అర్బన్: సమాచార హక్కు చట్టం ద్వారా ఎవరైనా వివరాలు కోరితే కచ్చితమైన సమాచారం అందించాలని ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. శనివారం స్థానిక వ్యవసాయ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం అమలుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజలకు వజ్రాయుధం లాంటిదన్నారు. దీనిని ఎవరూ చులకన చేయరాదన్నారు. అనంతరం ఆర్టీఐ అర్జీలకు ఎన్ని రోజుల లోపు సమాధానం ఇవ్వాలి, సమాచారం ఏవిధంగా రికార్డు చేయాలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమాచార హక్కు చట్టం అమల్లో నిర్లక్ష్యం వహిస్తే తలెత్తే పరిణామాలు తెలియజేశారు. సమవేశంలో హెచ్‌ఓలు, ఎంఐఏఓలు, ఎంఐ ఇంజినీర్లు, రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్టీఐ చట్టాన్ని పకడ్బందీగా
అమలు చేయాలి
సిబ్బందికి ఏపీఎంఐపీ పీడీ,
ఉద్యానశాఖ అధికారి ఆదేశం