
‘ఎంటీఎస్’పై కూటమి కక్ష
ఇటీవల జరిగిన బదిలీల్లో మడకశిర నియోజకవర్గానికి కేటాయించిన ఎంటీఎస్ టీచర్లు మండలం ఎంటీఎస్ టీచర్ల సంఖ్య అమరాపురం 72 గుడిబండ 54 రొళ్ల 56అగళి 34 మడకశిర 04 మొత్తం 220
మడకశిర: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పని చేస్తున్న 1998 డీఎస్సీ ఎంటీఎస్ (మినిమమ్ టైం స్కేల్) టీచర్లపై కూటమి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటించకుండా ఎంటీఎస్ టీచర్లను బదిలీ చేయడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కర్ణాటక సరిహద్దులో మారుమూల గ్రామాలకు తమను బదిలీ చేసి, ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోతున్నారు.
సీఎం చంద్రబాబు వక్ర దృష్టి..
సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న 1998 డీఎస్సీ అర్హుల ఇబ్బందులను గుర్తించిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వారి పట్ల సానుకూలంగా వ్యవహరించింది. ఈ క్రమంలో 2023 ఏప్రిల్‌లో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకుని 1998 డీఎస్సీలో అర్హత సాధించిన వారికి మినిమమ్ టైం స్కేల్ కింద ఉద్యోగ అవకాశాలు కల్పించారు. నెలకు గౌరవ వేతనంగా రూ.32,670 నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1998 డీఎస్సీకి సంబంధించి 4,032 మందికి ఉద్యోగాలు దక్కగా, ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి 594 మంది ఉన్నారు. అలాగే 2008 డీఎస్సీకి సంబంధించిన 1,900 మందికీ ఉద్యోగాలు దక్కాయి. అయితే వైఎస్ జగన్ హయాంలో ఉద్యోగాలు దక్కాయనే ఒకేఒక్క కారణంతోనే ఎంటీఎస్ టీచర్లపై సీఎం చంద్రబాబు వక్ర దృష్టి సారించినట్లుగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో అందరికీ రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను వర్తింపజేసిన ప్రభుత్వం.. ఎంటీఎస్ టీచర్ల విషయంలో మాత్రం కాలరాసిందనే ఆరోపణలున్నాయి. రెగ్యులర్ టీచర్లతో సమానంగా కాకుండా వారి బదిలీల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎంటీఎస్ టీచర్ల బదిలీలను చేపట్టింది. పథకం ప్రకారం సాగించిన ఈ కుట్రలో ఎంటీఎస్ టీచర్లు బలిపశువులయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 594 మంది ఎంటీఎస్ టీచర్లకు గాను ఒక్క మడకశిర నియోజకవర్గానికే 220 మందిని బదిలీ చేశారు. వీరందరూ కర్ణాటక సరిహద్దున మారుమూల పల్లెల్లో విధుల్లో చేరాల్సి వచ్చింది. మిగిలిన 374 మంది కూడా రాయదుర్గం నియోజకవర్గంలోని కర్ణాటక సరిహద్దున ఉన్న మారుమూల గ్రామాలకు బదిలీ అయ్యారు.
గ్రామీణ విద్యార్థులను ఆదుకున్న
వైఎస్ జగన్ నిర్ణయం..
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగం నిర్వీర్యమై పోతోంది. అనాలోచిత నిర్ణయాలతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సరిహద్దు మండలాల్లో పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు ఖాళీ పడ్డాయి. దీంతో సరిహద్దు మండలాల్లోని విద్యార్థుల చదువులు కుంటుపడే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో వైఎస్ జగన్ నియమించిన ఎంటీఎస్ టీచర్లు విద్యా ప్రదాతలుగా నిలిచారు. ఒకవేళ వైఎస్‌జగన్ ఈ ఎంటీఎస్ టీచర్లను నియమించకపోయి ఉంటే సరిహద్దు మండలాల్లోని పాఠశాలలన్నీ ఈ రోజు మూతపడే పరిస్థితి ఏర్పడేది.
సరిహద్దు మండలాల బడులకు
నియమించిన ప్రభుత్వం
దివ్యాంగులనూ కనికరించని
కూటమి ప్రభుత్వం
ఒక మడకశిర నియోజకవర్గానికే
220 మంది కేటాయింపు
వైఎస్ జగన్ హయాంలో
ఉద్యోగాలొచ్చాయనే కక్షతోనే
వేధింపులంటున్న ఎంటీఎస్ టీచర్లు
ఎంటీఎస్ టీచర్‌గా ఉద్యోగం వచ్చిన ప్రారంభంలోనే ఆయనకు 50 ఏళ్లు. మడకశిర పట్టణ సమీపంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే వారు. కొన్ని నెలల క్రితం అనుకోని విధంగా ప్రమాదానికి గురై కాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల ఇంటికొచ్చారు. ఇంకా నడవడానికి కూడా కాలు పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఆ టీచర్‌ని ప్రభుత్వం కర్ణాటక సరిహద్దులోని మారుమూల ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలకు బదిలీ చేసింది.
... ఎంటీఎస్ టీచర్లపై ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు నిదర్శనమే ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీలు. అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దివ్యాంగులనే కనికరం కూడా లేకుండా వారిని సుదూరంగా కర్ణాటక సరిహద్దు గ్రామాలకు బదిలీ చేసింది. ఈ లెక్కన ఒక్క మడకశిర నియోజకవర్గంలోనే 220 మంది ఎంటీఎస్ టీచర్లు విధుల్లో చేరాల్సి వచ్చింది.