
21న జాబ్‌మేళా
అనంతపురం ఎడ్యుకేషన్: ఎంఎన్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పార్ట్‌టైం, ఫుల్‌టైం ఉద్యోగాల కోసం ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు అనంతపురం జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పనాధికారి పల్లవి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 43 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతీయువకులు అర్హులు. జీతం రూ.10 వేల నుంచి రూ. 30 వేల వరకు ఉంటుంది. ఎంపికై న వారు అనంతపురంలో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు బయోడేటా ఫారం, విద్యార్హత ఒరిజినల్, జిరాక్స్ పత్రాలు, ఆధార్, బ్యాంకు అకౌంట్, పాన్‌కార్డు వెంట తీసుకెళ్లాలి.
కలుషిత నీరు తాగి
27 గొర్రెల మృతి
రామగిరి: కలుషిత నీరు తాగి 27 గొర్రెలు మృతి చెందిన ఘటన రామగిరి మండలం పెద్ద కొండాపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలానికి మందు కొట్టేందుకు యూరియాను నీటి తొట్టెలో కలిపి పిచికారీ చేశాడు. అయితే ఈ విషయం తెలియని గొర్రెల కాపరులు గంగన్న, పెద్దన్న తమ జీవాలను మేపునకు తోలుకెళ్లినప్పుడు దాహంతో ఉన్న గొర్రెలు తొట్టెలోని నీటిని తాగాయి. 27 గొర్రెలు మృతి చెందాయి. సమాచారం అందుకున్న పశువైద్యాధికారి మౌలిలీబాషా అక్కడకు చేరుకుని పరిశీలించారు. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న మరికొన్ని గొర్రెలకు తక్షణమే చికిత్స అందజేశారు. ఘటనతో రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరులు వాపోయారు.
పట్టపగలే రెండిళ్లలో చోరీ
పావగడ: స్థానిక శ్రీనివాసనగర్‌లో మున్సిపల్ మాజీ అధ్యక్షురాలు సుమ అనిల్, ఉపాధ్యాయుడు పాండు ఇళ్లలో గురువారం మధ్యాహ్నం చోరీ జరిగింది. సుమ, ఆమె భర్త అనిల్ ఇంటికి తాళం వేసి ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. ఆ సమయంలో దుండగులు తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలో దాచిన రూ.4 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరించారు. అనంతరం నల్లరాళ్ల గంగమ్మ గుడి వీధిలో నివాసముంటున్న ఉపాధ్యాయుడు పాండు ఇంట్లోకి చొరబడి నగదు, బంగారు ఆభరణాలు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.