
‘కేఎస్‌ఎన్’ డిగ్రీ ఫలితాల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక కేఎస్‌ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను బుధవారం ప్రిన్సిపాల్ కేసీ సత్యలత, పరీక్షల విభాగాధిపతి హెచ్.శివశంకర్ బుధవారం విడుదల చేశారు. 623 మంది విద్యార్థినులు పరీక్ష రాయగా 71.75 శాతంతో 447 మంది ఉత్తీర్ణత సాధించారు. బీఏ (అనర్స్)లో 85 మందికి గాను 61 మంది. బీకాం (ఆనర్స్)లో 221 మందికిగాను 160 మంది, బీఎస్సీ (ఆనర్స్)లో 228 మందికి గాను 214 మంది, బీబీఏలో 29 మందికిగాను 12 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను కళాశాల ఎగ్జామినేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రీవాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్‌కు సంబంధించి ఈ నెల 21 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. రీవాల్యూషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.300, పర్సనల్ వెరిఫికేషన్‌కు రూ.600 చెల్లించాలని ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల ఉప విభాగాధిపతి రమణ నాయుడు, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీరంగయ్య, రామలింగారెడ్డి, నాగభూషణం, సింధు, రామకృష్ణ, రామాంజనేయులు, రేణుకాదేవి, ఆదినారాయణ, పర్వీన్, అనురాధ, రమాదేవి, లక్ష్మి, యూడీసీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.