
అండర్–16 జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
అనంతపురం: ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకూ వైఎస్సార్ జిల్లా కడపలో జరిగే అండర్–16 సౌత్ జోన్ క్రికెట్ టోర్నీలో ప్రాతినిథ్యం వహించే జిల్లా జట్టును బుధవారం ఎంపిక చేశారు. ఎంపికై నా వారిలో ఆర్.సాత్విక్ (కెప్టెన్, అనంతపురం), ఎన్.సంజయ్‌కుమార్ (వైస్ కెప్టెన్, నార్పల), జి.కౌశిక్ (వికెట్ కీపర్, అనంతపురం), కె.అశ్విన్, యు.తన్మయ్ కార్తీక్‌రెడ్డి, అభినవ్ సాత్విక్ రెడ్డి, కుషాల్ సాయి, దేవాన్ష్, టి.కిరణ్‌కుమార్, వై.లిఖిత్, పి.నిహార్, ఎస్.కార్తీక్ (అనంతపురం), జియాద్ (హిందూపురం), జె.సంతోష్ (కదిరి), బి.అఖిల్ కుమార్ (గోరంట్ల), ఆదినారాయణ రెడ్డి (ఆత్మకూరు), బి.అఖిల్ కుమార్ (గొట్లూరు) ఉన్నారు.