
ప్రలోభపెట్టి.. పదవులు పొంది
మడకశిర: ప్రలోభపెట్టారు... అందుకు లొంగనివారిని భయపెట్టారు.. అధికారం కోసం పూర్తిగా దిగజారి ప్రవర్తించారు. చివరకు 9 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల మద్దతుతో మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను టీడీపీ నేతలు కై వసం చేసుకున్నారు.
చైర్మన్‌గా నరసింహరాజు,
వైస్ చైర్‌పర్సన్‌గా ప్రభావతి..
మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం అధికారులు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం సమావేశం నిర్వహించారు. పెనుకొండ ఆర్డీఓ ఆనందకుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించగా.. ఎక్స్ అఫిషియో సభ్యుడి హోదాలో స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పాల్గొన్నారు. నగర పంచాయతీలో 20 మంది కౌన్సిలర్లు ఉండగా... సమావేశానికి 14 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యుడు ఎంఎస్ రాజు హాజరయ్యారు. చైర్మన్ స్థానానికి టీడీపీకి చెందిన 15వ వార్డు కౌన్సిలర్ నరసింహరాజు, వైస్ చైర్మన్ స్థానానికి టీడీపీకి చెందిన 4వ వార్డు కౌన్సిలర్ ప్రభావతి నామినేషన్లను దాఖలు చేయగా.. మిగతా వారు బలపరిచారు. దీంతో నరసింహరాజు చైర్మన్‌గా, ప్రభావతి వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ఆనందకుమార్ ప్రకటించారు. కాగా, పదవుల ఆశతో టీడీపీలో చేరిన 9 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లలో ఏ ఒక్కరికీ పదవులు దక్కలేదు. చైర్మన్ పదవిపై ఆశతో టీడీపీలో చేరిన 17వ వార్డు కౌన్సిలర్ సుభద్రను కూడా టీడీపీ నేతలు మోసం చేశారు.
ఎన్నికను బహిష్కరించిన కౌన్సిలర్లు
అప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహించిన మడకశిర చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. మడకశిరలో 20 వార్డులుండగా... గత మున్సిపల్ ఎన్నికల్లో 15 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ 5 స్థానాలతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే పీఠంపై కన్నేసిన టీడీపీ నేతలు...వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి 9 మందిని లాక్కున్నారు. తాగా ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల మద్దతుతోనే పదవులు దక్కించుకున్నారు. అయితే టీడీపీ నేతలు ఎంతగా ప్రయత్నించినా... లక్ష్మీనరసమ్మ, రామచంద్రారెడ్డి, సతీష్‌రెడ్డి, అన్సర్, శ్రీనివాసులు, అంజన్ కుమార్ యాదవ్ వైఎస్సార్ సీపీని వీడలేదు. తాజాగా ఎన్నికను బహిష్కరించి తాము ప్రజలపక్షమని చాటారు.
మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్‌పర్సన్ పదవులు టీడీపీ కై వసం
చైర్మన్‌గా నరసింహరాజు,
వైస్ చైర్‌పర్సన్‌గా ప్రభావతి ఎన్నిక
ఎన్నికను బహిష్కరించిన
ఆరుగురు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు