అక్రమ మద్యంపై ప్రత్యేక నిఘా | Sakshi
Sakshi News home page

అక్రమ మద్యంపై ప్రత్యేక నిఘా

Published Fri, Apr 12 2024 12:20 AM

భక్తజనం నడుమ సాగుతున్న రథోత్సవం  - Sakshi

సెబ్‌ డిప్యూటీ కమిషనర్‌ నాగముద్దయ్య

పుట్టపర్తి టౌన్‌: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే అక్రమ మద్యం ప్రత్యేక నిఘా పెట్టాలని సెబ్‌ డిప్యూటీ కమిషనర్‌ నాగముద్దయ్య పేర్కొన్నారు. గురువారం పుట్టపర్తి జిల్లా సెబ్‌ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందిలో ఆయన సమాశమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని తెలిపారు. జిల్లాలో అక్రమ మద్యం సరఫరా చేసే మార్గాలలో రూట్‌ వాచ్‌లను నిర్వహించి వాహనాల తనిఖీలు చేపట్టి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం సరఫరా కాకుండా చూడాలన్నారు. అక్రమ మద్యం డంపులపై కూడా నిఘా ఉంచాలన్నారు. విధుల్లో ఏమ్రాతం అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నియమావళికి లోబడి ఎలాంటి రాజకీయ నాయకులకు ఒత్తిళ్లకు తలొగ్గకుండా అప్రమత్తంగా ఉండి ఎన్నికలు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి సుబ్రమణ్యం, జిల్లా సెబ్‌ అధికారి సహదేవ, సెబ్‌ ఇన్‌స్పెక్టర్లు కన్నయ్య, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హనుమా.. మము గనుమా

కనుల పండువగా

మురడి అంజన్న రథోత్సవం

రాయదుర్గం: డీ హీరేహాళ్‌ మండలంలోని మురడిలో గురువారం ఆంజనేయస్వామి బ్రహ్మరథోత్సవం కనులపండువగా జరిగింది. స్వామికి వివిధ అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించిన రథంలో అధిష్టింపజేశారు. ఈఓ నరసింహారెడ్డి, గ్రామ పెద్దలు నారికేళాలు సమర్పించి ఉత్సవం ప్రారంభించారు. రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హనుమా మము గనుమా అంటూ దివ్య స్వరూపుడి దర్శనం చేసుకుని తరించారు. రథం ముందు యువకులు నందికోలు నాట్యం, కోలాటం, చెక్కభజనలతో ఆకట్టుకున్నారు. మహిళలు పొర్లుదండాలతో మొక్కులు తీర్చుకున్నారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆంజనేయస్వామి ఆలయం వద్ద రాత్రి 7 గంటలకు లంకా దహనం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

జాతీయస్థాయిలో

కేజీబీవీ విద్యార్థినుల ప్రతిభ

అంతర్జాతీయ పోటీలకు ఎంపికై న

చందుప్రియబాయి

చిలమత్తూరు: మండల కేంద్రంలోని బైరేకుంట వద్ద ఉన్న కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు జాతీయస్థాయి సీనియర్స్‌ విభాగంలో జంప్‌ రోప్‌ స్కిప్పింగ్‌ పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. పాఠశాల ఎస్‌ఓ సునీత కుమారి మాట్లాడుతూ ... మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 2 వరకూ నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో పాఠశాల విద్యార్థినులు చందుప్రియబాయి, ఎస్‌.రిన్సీ, టి.గిరిజ బంగారు పతకాలు సాధించారన్నారు. ఇందులో చందుప్రియబాయి అంతర్జాతీయ పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. త్వరలో జపాన్‌ రాజధాని టోక్యోలో జరిగే పోటీల్లో ఆమె పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ఎస్‌ఓ, ఉపాధ్యాయులు అభినందించారు.

అధికారులతో మాట్లాడుతున్న 
సెబ్‌ డిప్యూటీ కమిషనర్‌ నాగముద్దయ్య
1/2

అధికారులతో మాట్లాడుతున్న సెబ్‌ డిప్యూటీ కమిషనర్‌ నాగముద్దయ్య

జాతీయస్థాయిలో బంగారు పతకాలు 
సాధించిన విద్యార్థినులు
2/2

జాతీయస్థాయిలో బంగారు పతకాలు సాధించిన విద్యార్థినులు

Advertisement
Advertisement