విష పురుగు కుట్టి వృద్ధురాలి మృతి | Sakshi
Sakshi News home page

విష పురుగు కుట్టి వృద్ధురాలి మృతి

Published Fri, Apr 12 2024 12:20 AM

-

యాడికి: విష పురుగు కుట్టడంతో యాడికి మండలం గుడిపాడుకు చెందిన దండు లక్షుమమ్మ (73) మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... లక్షుమమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం రాత్రి భోజనం ముగించుకుని ఇంటి ఆవరణలో పడుకున్న ఆమె... గురువారం తెల్లవారు జామున తనను ఏదో కుట్టినట్లుగా గుర్తించింది. అయినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండిపోయింది. ఉదయం నిద్ర లేచిన తర్వాత తల బరువుగా ఉంటూ కళ్లు కనపించకపోవడంతో విషయాన్ని కుమారులకు తెలిపింది. దీంతో పెద్ద కుమారుడు శ్రీరాములు వెంటనే ఆమెను తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి పిలుచుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు విషపురుగు కుట్టడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారిందని గుర్తించి అనంతపురానికి రెఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం ఆమె మృతి చెందింది. ఘటనపై రెండో కుమారుడు కంబగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement