వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు

Published Fri, Apr 12 2024 12:20 AM

పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి  
 - Sakshi

రామగిరి: పాతికేళ్లుగా అధికారంలో ఉండి పేదలు, బడుగుల సంక్షేమాన్ని విస్మరించిన పరిటాల కుటుంబం వైఖరితో విసుగు చెంది రామగిరి మండలానికి చెందిన పలువురు వైఎస్సార్‌సీపీకిలో చేరారు. కంచుకుంట, కానుగులకుంట గ్రామాలకు చెందిన మాధవరెడ్డి, నాగరాజు, రంగయ్య, ముత్యాలప్ప, హరి, వీరన్న, రంగనాథ్‌, శివ, అంజన్‌రెడ్డితో పాటు మొత్తం 20 కుటుంబాలు గురువారం రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరాయి. చెన్నేకొత్తపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కేవలం టీడీపీ మాది అనే సామాజిక వర్గానికి వారికి మాత్రమే పెద్దపీట వేస్తూ మిగిలిన సామాజిక వర్గాలను అన్ని విధాలుగా పరిటాల కుటుంబం అణచి వేసిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అంతేకాక రాష్ట్రాభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమనే విషయం ఈ ఐదేళ్లలో నిరూపితమైందని, దీంతో తామంతా వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రామగిరి ఎంపీపీ మీనుగ నాగరాజు, పార్టీ మండల కన్వీనర్‌ కర్రా హనుమంతరెడ్డి, జెడ్పీటీసీ నాగార్జున, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement