గ్రామ స్థాయిలోనే పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

గ్రామ స్థాయిలోనే పరిష్కారం

Published Thu, Nov 30 2023 12:44 AM | Last Updated on Thu, Nov 30 2023 12:44 AM

జగనన్నకు చెబుదాంలో అర్జీలు స్వీకరిస్తున్న 
కలెక్టర్‌ అరుణ్‌బాబు  - Sakshi

నల్లమాడ: ‘‘చాలా సమస్యలకు స్థానికంగానే పరిష్కారం లభిస్తుంది. కానీ ఎక్కువ మంది ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందనకు వచ్చి అర్జీలిస్తున్నారు. స్థానిక అధికారులు సమస్యలు పరిష్కరిస్తే ప్రజలు అంతదూరం వచ్చే అవసరం ఉండదు. ఈమేరకు అందరూ చర్యలు చర్యలు తీసుకోవాలి. గ్రామస్థాయిలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ఇందులో ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉన్నా చర్యలు తప్పవు’’ అని కలెక్టర్‌ అరుణ్‌బాబు అధికారులను హెచ్చరించారు. బుధవారం స్థానిక ఆర్డీటీ ఏరియా కార్యాలయంలో అధ్యక్షతన ‘జగనన్నకు చెబుదాం’ మండల స్థాయి స్పందన కార్యక్రమం నిర్వహించారు. భూ సమస్యలు, హౌసింగ్‌ బిల్లులు తదితర సమస్యలపై ప్రజలు మొత్తంగా 138 అర్జీలు అందించారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్‌ అరుణ్‌బాబు మాట్లాడారు. సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ‘జగనన్నకు చెబుదాం’ మండలస్థాయి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హత ఉండీ... ప్రభుత్వ పథకాలు అందనివారు వెంటనే సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌, డీఆర్‌ఓ కె.కొండయ్య, ఆర్డీఓ భాగ్యరేఖ, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ తిప్పేంద్రనాయక్‌, డీసీఓ కృష్ణానాయక్‌, డీఈఓ మీనాక్షి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రషీద్‌ ఖాన్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ రామకృష్ణ, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్‌, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్‌, ఐసీడీఎస్‌ పీడీ లక్ష్మీకుమారి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్‌, డీపీఓ విజయ్‌కుమార్‌, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్‌రావు, తహసీల్దార్‌ దేవేంద్రనాయక్‌, ఎంపీడీఓ కొండన్న పాల్గొన్నారు.

అర్జీల్లో కొన్ని ఇలా..

● తమ తాతముత్తాతలు కొనుగోలు చేసిన 180 ఎకరాల భూమిని తాము దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని పెమనకుంటపల్లి తండా, బాసంవారిపల్లి, కొండ్రవారిపల్లి, అరవవాండ్లపల్లి తండాల రైతులు తెలిపారు. అయితే ఎన్‌. బడవాండ్లపల్లికి చెందిన ఓ రైతు ఆ భూమిలో తనకూ 70 ఎకరాలు హక్కు ఉందంటూ తమను ఇబ్బంది పెడుతున్నాడని వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పరిశీలించి చర్యలు తీసుకోవాలని అర్జీ అందజేశారు.

● నల్లమాడకు చెందిన పొరకల వీరాంజనేయులు 15 ఏళ్లుగా చిట్టీలు నిర్వహిస్తూ చాలా మంది వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని పరారయ్యాడని మాధవరెడ్డి, షాను ఫిర్యాదు చేశారు. వీరాంజనేయులును పట్టుకొని తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కలెక్టర్‌ను కోరారు.

ప్రజల నుంచి అందే అర్జీలపై

ప్రత్యేక దృష్టి సారించాలి

‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో కలెక్టర్‌ అరుణ్‌బాబు

No comments yet. Be the first to comment!
Add a comment
కార్యక్రమంలో పాల్గొన్న 
జిల్లా, మండల స్థాయి అధికారులు
1/1

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా, మండల స్థాయి అధికారులు

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement