యూరియా కోసం అన్నదాతల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

యూరియా కోసం అన్నదాతల ఆందోళన

Jun 10 2026 12:49 AM | Updated on Jun 10 2026 12:49 AM

కోవూరు: ఖరీఫ్‌ సాగు కీలక దశలో ఉన్న సమయంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో విసిగి వేసారిన రైతులు స్థానిక పడుగుపాడు సొసైటీ కార్యాలయం వద్ద ఆందోళనను మంగళవారం చేపట్టారు. ఒక బస్తా యూరియా కోసం సొసైటీల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన కొత్త యాప్‌ నిబంధనలు మరింత భారంగా మారాయని తెలిపారు. తమకు అవసరమైనంత మేర అందజేయాలని డిమాండ్‌ చేశారు.

1న డీసెట్‌

నెల్లూరు (టౌన్‌): డీసెట్‌ను వచ్చే నెల ఒకటిన నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హాల్‌ టికెట్లు ఈ నెల పది నుంచి అందుబాటులో ఉంటాయని.. ఫలితాలను వచ్చే నెల నాలుగున విడుదల చేయనున్నారని వివరించారు. అర్హత సాధించిన విద్యార్థులకు వచ్చే నెల పది నుంచి 15లోపు వెబ్‌ ఆప్షన్లు.. 16న సీట్ల అలాట్‌మెంట్‌.. 19 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌.. 25న తరగతులు ప్రారంభంకానున్నాయని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement