రైల్లోంచి జారిపడి.. | - | Sakshi
Sakshi News home page

రైల్లోంచి జారిపడి..

Jun 10 2026 12:49 AM | Updated on Jun 10 2026 12:49 AM

గుర్తుతెలియని వ్యక్తి మృత్యువాత

వెంకటాచలం: రైల్లోంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని గొలగమూడి రైల్వేగేట్‌ సమీపంలో మంగళవారం గుర్తించారు. రైల్వే ఎస్సై హరిచందన కథనం మేరకు.. గొలగమూడి రైల్వేగేట్‌ సమీపంలో అప్‌లైన్‌ పక్కన మృతదేహం ఉందని నెల్లూరు రైల్వేస్టేషన్‌ మాస్టర్‌ ఫిర్యాదు చేయడంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అతని వయస్సు 30 నుంచి 35 ఏళ్లలోపు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement