వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళలకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళలకు పెద్దపీట

Jun 9 2026 9:16 AM | Updated on Jun 9 2026 9:16 AM

చంద్రబాబు మోసానికి రెండేళ్లుగా నష్టపోయిన మొత్తం రూ.3,128.40 కోట్లు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో

ఐదేళ్లు అందిన సాయం

రూ.8,143.45 కోట్లు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆడబిడ్డలను వంచించి అధికారంలోకి రావడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో పొదుపు రుణాల మాఫీ, తాజా ఎన్నికల్లో ఆడబిడ్డ నిధి వంటి బూటకపు హామీలతో అధికారం దక్కించుకుని వెన్నుపోటు పొడవడం ఆయన నైజం. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను పీఠమెక్కాక తుంగలో తొక్కారు. కుటుంబంలో ఎంత మంది మహిళలు ఉంటే అంత మందికి ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలా రూ.1,500 చొప్పున అందిస్తానంటూ చంద్రబాబు వేదికలెక్కి ఉపన్యసిస్తూ ఊగిపోయారు. రెండేళ్లు ఒక్క ఆడబిడ్డకు రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు మోసానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అనేది మరోసారి రుజువైంది. గతంలో అధికారంలోకి రాక ముందు ప్రతి పొదుపు మహిళ రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదు. మీ అన్నగా నేనే చెల్లిస్తానంటూ సెంటిమెంట్‌తో ఓట్లు వేయించుకుని.. ఆ తర్వాత కర్రుకాల్చి వాత పెట్టారు. ఒక్కొక్క మహిళ అప్పట్లో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పొదుపు బకాయిలు ఉంటే పూర్తిగా ఎగ్గొట్టి ఎన్నికల ముందు రూ.10 వేలు పసుపు కుంకుమ అంటూ మోసం చేశారు.

రెండేళ్లుగా రూ.3,128.40 కోట్ల బాకీ

చంద్రబాబు ఎన్నికల హామీల్లో ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1,500 ఇస్తామన్నారు. జిల్లాలో 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలు 8.69 లక్షల మంది ఉన్నారు. ఈ లెక్కన ప్రతి నెలా రూ.130.35 కోట్లు, ఏడాదికి రూ.1564.20 కోట్లు మహిళల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. రెండేళ్లుగా రూ.3,128.40 కోట్లు మహిళలకు చంద్రబాబు బాకీ పడ్డారు.

అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ చేయూత, ఆసరా

వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2020–21 ఏడాది నుంచి ఈ రెండు పథకాలను అమల్లోకి తెచ్చారు. 45 ఏళ్లు నిండిన 60 ఏళ్లలోపు అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ చేయూత కింది ఏటా రూ.18,750 ఇస్తామని నాలుగేళ్లు క్రమం తప్పకుండా రూ.934.83 కోట్లు అందజేశారు. అలాగే గతంలో పొదుపు రుణాలు తీసుకున్న వారికి పూర్తిగా రుణమాఫీ చేస్తానని, ఈ మొత్తాన్ని నాలుగు దఫాలుగా నాలుగేళ్ల పాటు అందిస్తానని చెప్పిన విధంగా 2020–21 ఏడాది నుంచి అమలు చేశారు. మొత్తం రూ.853.69 కోట్లు పొదుపు మహిళల ఖాతాల్లో జమ చేశారు.

వ్యాపారి నుంచి పారిశ్రామికవేత్త వరకు..

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మహిళలకు అందించిన ఆర్థిక సహకారంతో ఎంతో మంది వ్యాపారి నుంచి పారిశ్రామికవేత్తలుగా మారారు. సుమారు 1.20 లక్షల మంది మహిళలు కుటీర పరిశ్రమలు స్థాపించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందారు. కూటమి సర్కార్‌ నయవంచన వల్ల మహిళలు తీవ్రంగా నష్టపోయారు. గతంలో ప్రతి నెలా ఏదోక పథకం పేరుతో మహిళల బ్యాంకు ఖాతాల్లో నగదు జమయ్యేది. ప్రస్తుతం కూటమి పాలనలో రెండేళ్లుగా మహిళలకు ఎటువంటి నగదు అందడం లేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంత మహిళలు సూక్ష్మ సంస్థల్లో రుణాలు తీసుకుని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

విడత లబ్ధిదారులు నగదు

రూ.కోట్లలో

మొదటి 16,151 16.15

రెండో 18,052 18.05

మూడో 29,957 29.96

నాల్గో 16,923 16.92

ఐదో 27,007 27.01

ఆరో 15,138 14.42

జగనన్నతోడు

(రూ.122.51 కోట్లు)

జిల్లాలో ఆడబిడ్డ నిధికి అర్హులైన మహిళలు 8.69 లక్షల మంది

నెలకు రూ.1500 సాయం

రెండేళ్లుగా ఎగనామం

జిల్లాలో 4.30 లక్షల మంది పొదుపు మహిళలు

వైఎస్సార్‌సీపీ పాలనలో ఐదేళ్లూ అందిన సంక్షేమ పథకాలు

పొదుపు, సీ్త్రనిధి, సున్నావడ్డీ, చేయూత, ఆసరా, జగనన్నతోడుతో మహిళల ఆర్థిక స్వావలంబన

మహిళల సాధికారతను పట్టించుకోని కూటమి

కాగితాలకే పరిమితమైన కోటీశ్వరులను చేసే ప్రచారం

జిల్లాలో 4.30 లక్షల మంది స్వయం సహాయక గ్రూపు మహిళలు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పొదుపు మహిళలే కాదు.. ప్రతి మహిళకు పెద్దపీట వేసింది. ప్రతి నెలా ఏదోక సంక్షేమ కార్యక్రమంతో మహిళలకు గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. జిల్లాలో ప్రతి కార్యక్రమం మహిళల పేరుతో అమలు చేశారు. ఇంటి పట్టాలు, ఇతర రుణాలు, ప్రతి సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు అందజేశారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, వారి అభివృద్ధికి పెద్దపీట వేసింది. స్వయం సహాయక గ్రూపు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వందల కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసింది. తీసు కున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రత్యేక దృష్టి సారించింది. మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి కుటీర పరిశ్రమల స్థాపనకు భారీ స్థాయిలో ప్రోత్సా హాలను ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా మహిళలు బ్యాంకు లింకేజీ, సీ్త్ర నిధి, సున్నా వడ్డీ, చేదోడు, చేయూత, జగనన్న తోడు, తదితర సంక్షేమ పథకాల ద్వారా తీసుకున్న రుణాలు చెల్లించడంతో ప్రతిఫలంగా రూ.8,143.45 కోట్ల అందజేశారు. సున్నా వడ్డీ కింద నాలుగేళ్లలో రూ.202.35 కోట్లు తిరిగి అక్క చెల్లెమ్మలకు చెల్లించారు. ఐదో ఏడాది ఎన్నికలు రావడంతో అప్పటికే సిద్ధం చేసిన సున్నావడ్డీ చెల్లింపులను కూటమి ప్రభుత్వం ఎగనామం పెట్టడడమే కాకుండా.. కూటమి పాలనలో రెండేళ్లుగా సున్నా వడ్డీకి దిక్కులేకుండా పోయింది.

Advertisement
 
Advertisement
Advertisement