వైఎస్సార్‌సీపీ పాలన స్వర్ణయుగం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ పాలన స్వర్ణయుగం

Jun 9 2026 9:16 AM | Updated on Jun 9 2026 9:16 AM

వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలన మహిళలకు స్వర్ణయుగంగా మారింది. సంక్షేమ పథకాలతోపాటు ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎంతో మంది వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా అవతరించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అప్పటి వరకు ఉన్న పొదుపు మహిళల రుణాల మొత్తాన్ని నాలుగేళ్లలో తిరిగి వారి ఖాతాల్లోనే జమ చేశారు. గతంలో టీడీపీ చేసిన మోసానికి డీఫాల్టర్లు అయిన పొదుపు గ్రూపులను పునరుద్ధరించి బ్యాంకుల ద్వారా తిరిగి రుణాలిప్పించి.. ఆయా గ్రూపుల్లోని మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా ఎదిగేందుకు దోహదపడ్డారు. విస్తృతంగా పొదుపు రుణాలు, సీ్త్ర నిధి రుణాలు కల్పించి అత్యధిక మంది జీవితాలను మెరుగుపర్చారు. సున్నావడ్డీ, చేయూత, ఆసరా, జగనన్నతోడు వంటి పథకాలతో వారి ఆర్థిక స్వాతంత్య్రానికి దన్నుగా నిలిచారు. అమ్మఒడి వంటి పథకంతోపాటు ప్రతి కుటుంబానికి జగనన్న కాలనీల్లో రూ.లక్షల విలువైన ఆస్తిని సొంతం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement