ఇది పొగాకు రైతుల దుస్థితి
వైఎస్సార్సీపీ హయాంలో క్వింటా
కూటమి
పాలనలో క్వింటా
రూ.37,000
రూ.23,900
జిల్లాలో కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల్లో వర్జీనియా పొగాకు పంటను రైతులు విస్తృతంగా సాగు చేస్తున్నారు. వేల మంది పొగాకు పంట సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో పొగాకు రైతులకు స్వర్ణయుగంలా సాగింది. పొగాకు ధరలు పతనమైన సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి నేరుగా వేలం ప్రక్రియలో పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంది. దీంతో పొగాకు వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు లాభాల బాట పట్టారు. ఐదేళ్లూ కాసుల పంటలు పండాయి. 2022–23, 2023–24 సీజన్లు అయితే రికార్డు ధరలు పొగాకు రైతు లకు వచ్చాయి. ఇక బ్రైట్ గ్రేడ్ పొగాకు అయితే ఏకంగా క్వింటా రూ.37 వేల వరకు పలికింది. పొగాకు రైతులకు మరో మేలు చేసే చర్యలు కూడా గత ప్రభు త్వం తీసుకుంది. అప్పటి వరకు అధికంగా పండించిన పొగాకుపై 5 శాతం వరకు జరిమానా విధించి పొగాకు కొనుగోలు చేసేవారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అధిక పొగాకు ఉత్పత్తులపై ఉన్న జరిమానాలు పూర్తిగా రద్దు చేయించారు. దీంతో రైతులు ఎటువంటి జరిమానాలు లేకుండానే అధికంగా పండించిన పొగాకును వేలం కేంద్రాల్లో అమ్ముకునే అవకాశం లభించింది. దీంతోపాటు పొగాకు చూర, ముక్క వంటివి కూడా వేలం కేంద్రాల్లోనే అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. దీంతో రైతులకు అన్ని విధాలా లాభాలు చేకూర్చి ఆదాయాలు రెట్టింపయ్యాయి.
కూటమి పాలనలో క్వింటాకు రూ.13,100 నష్టం
ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. 2024–25, 2025–26 సీజన్లలో పొగాకు అమ్మకాల ధరలు దారుణంగా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ పాలనలో బ్రైట్ గ్రేడ్ కేజీ పొగాకు రూ.365 పలికితే అదే పొగాకు కూటమి పాలనలో రూ.239లకు కొనుగో లు చేస్తున్నారు. అంటే క్వింటా పొగాకు మీద ఒక రైతుకు రూ.13,100 వరకు నష్టపోతున్నారు.


